దేశంలో కరోనా పంజా,ఒక్కరోజులోనే 2 వేలకు పైగా....

దేశంలో కరోనా తన విశ్వరూపం దాల్చుతుంది.ఒక్కరోజులోనే పదివేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండడమే ఆందోళన కలిగిస్తుంటే మరణాలు కూడా వేల సంఖ్యలో చోటుచేసుకోవడం మరింత కంగారు పుట్టిస్తుంది.

 Covid Death Cases Are Hugely Increased In India,corona,corona Positive Cases,cov-TeluguStop.com

ఇప్పటివరకు రోజుకు 2,3 వందల మరణాలు చోటుచేసుకుంటుండగా నిన్న ఒక్కరోజే ఏకంగా 2 వేలకు పైగా మరణాలు చోటుచేసుకోవడం గమనార్హం.గడిచిన 24 గంటల్లోనే 2003 మరణాలు చోటు చేసుకోవడం కలవరం సృష్టించింది.

రికార్డు స్థాయిలో జరిగిన మరణాలతో కరోనా ప్రమాద ఘంటికలను మోగిస్తోంది.వీటిలో మహారాష్ట్ర, ఢిల్లీలోనే అత్యధికంగా చోటు చేసుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

నిన్న ఒక్కరోజు 10,974 మందికి వైరస్ లక్షణాలు బయటపడగా, 2,003 మంది మరణించడం గమనార్హం.దీంతో మరణాల సంఖ్య ఏకంగా 11,903కు చేరినట్లు అయ్యింది.

ఇక పాజిటివ్ కేసుల సంఖ్య 3,54,065కు చేరగా, ప్రస్తుతం 1,55,227 మందికి వైద్యులు ఆయా రాష్ట్రాల కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.మరోపక్క వైరస్‌ను జయించి కోలుకున్నవారి సంఖ్య 1,86,935గా ఉంది.తాజా గణాంకాలతో మరణాల రేటు 3.4 శాతానికి చేరింది.కాగా మరణాలలో అత్యధికంగా మహారాష్ట్ర నుంచే వచ్చాయి.

అక్కడ ఏకంగా 1409 మంది మరణించినట్టు గణాంకాలు వెల్లడయ్యాయి.

అయితే గత రెండు నెలలుగా పెండింగులో ఉన్న మరణాల సంఖ్యను చేర్చడంతో ఈ సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.దీంతో అక్కడ అత్యధికంగా 1,13,445 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 5,537 మంది చనిపోయినట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube