టీకానా.. మాకొద్దు బాబోయ్ అంటున్న అమెరికన్లు, ముంచుకొస్తున్న ఎక్స్‌పైరీ గడువు..!!

అమెరికాను పెను విషాదంలోకి నెట్టిన కోవిడ్ వైరస్‌ను నియంత్రించేందుకు వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని ప్రజలు ఎదురుచూశారు.నిద్రాహారాలు మాని, రాత్రిపగలు శాస్త్రవేత్తలు పడిన కృషికి ప్రతిఫలంగా టీకా అందుబాటులోకి వచ్చింది.

 Covid Cases Fall Across Us But Experts Warn Of Dangers Of Vaccine Hesitancy-TeluguStop.com

నాటి నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అగ్రరాజ్యం విజయవంతంగా అమలు చేస్తోంది.ఇంత జరుగుతున్నా ప్రజల్లో ఏదో భయం, ఏదో అనుమానం.

టీకా తీసుకోవడం మంచిదేనా, ఏమైనా దుష్పరిణామాలు వస్తే పరిస్ధితేంటీ అన్న ఆందోళన పలువురిని వెంటాడుతోంది.అయితే ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం, సెలబ్రెటీలు, స్వచ్ఛంద సంస్థలు ఎంతగానో కృషి చేస్తున్నాయి.

 Covid Cases Fall Across Us But Experts Warn Of Dangers Of Vaccine Hesitancy-టీకానా.. మాకొద్దు బాబోయ్ అంటున్న అమెరికన్లు, ముంచుకొస్తున్న ఎక్స్‌పైరీ గడువు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అధికారంలోకి వస్తూనే కరోనా అంతమే తన మొదటి లక్ష్యయమన్నారు జో బైడెన్.అందుకు తగ్గట్టుగానే 100 రోజుల్లో 10 కోట్ల డోసుల టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.అధికార యంత్రాంగం సమర్థంగా పనిచేయంతో.మార్చి 25 నాటికి, అంటే 64 రోజుల్లోనే ఆ లక్ష్యాన్ని అందుకున్నారు.

దీంతో బైడెన్‌ తన లక్ష్యాన్ని 20 కోట్లకు పెంచారు.దాన్ని కూడా 10 రోజుల ముందే.

అంటే 90 రోజుల్లోనే ఛేదించారు.ఫలితంగా.ఒకప్పుడు రోజుకు 3.07 లక్షల కేసులు, రోజుకు దాదాపు 4,500 మరణాలతో వణికిపోయిన అమెరికా ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటోంది.కానీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత విస్తరించి, జూలై 4 నాటికి దేశాన్ని కరోనా ఫ్రీగా చేయాలని బైడెన్ కంకణం కట్టుకున్నారు.

Telugu Cdc, Corona Vaccine, Joe Biden, Kovid Virus‌, North, Tennessee, Trump-Telugu NRI

కానీ వ్యాక్సినేషన్‌పై ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని గణాంకాలు చెబుతున్నాయి.మిలియన్ డాలర్ల విలువ చేసే లాటరీలు.ఉచిత బీర్లు.

మారిజువానా షాట్లు.రైఫిళ్లు.

ఇలా ఎన్ని ఆఫర్లు ప్రకటించినా కొంత మంది మాత్రం టీకా తీసుకునేందుకు ససేమిరా అంటున్నారు.ఇప్పుడే కాదు.

రానున్న రోజుల్లో కూడా తాము టీకా వేయించుకునేది లేదని తేల్చిచెబుతున్నారు.దీంతో.

టెన్నెసీ, నార్త్ కరోలినా వంటి రాష్ట్రాలు తమ వద్ద మిగిలిపోయిన వ్యాక్సిన్ డోసులను కేంద్ర ప్రభుత్వానికి తిరిగి పంపుతున్నాయి.

భారత్ వంటి దేశాల్లో టీకాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో కొట్లాడుతుంటే.

అమెరికాలో మాత్రం కావాల్సిన దానికన్నా ఎక్కువే టీకాలు వున్నాయి.జనం వ్యాక్సిన్లు వేయించుకోవడాన్ని పక్కనబెడితే.

ఇప్పుడు ప్రభుత్వానికి మరో కొత్త సమస్య వచ్చి పడింది.అదే వాటి ఎక్స్‌పైరీ.

కరోనా నుంచి దేశాన్ని బయటపడేయాలని నిర్ణయించుకున్న మాజీ అధ్యక్షుడు ట్రంప్.టీకాల కోసం గత ఏడాదే పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.ఆ కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేసేందుకు రూ.75 వేల కోట్ల ఆర్ధిక సాయం మేర అందించారు.ఆయన కృషి ఫలించి గత డిసెంబరు నాటికే టీకాలు అందుబాటులోకి వచ్చాయి.

Telugu Cdc, Corona Vaccine, Joe Biden, Kovid Virus‌, North, Tennessee, Trump-Telugu NRI

అయితే ఏప్రిల్‌ రెండోవారం నాటికి రోజుకు సగటున 33 లక్షల డోసుల టీకాలు వేసిన అమెరికా ఇప్పుడు రోజుకు సగటున 8.7 లక్షల డోసులు కూడా ఇవ్వలేకపోతోంది.సీడీసీ గణాంకాల ప్రకారం ఇప్పటిదాకా అమెరికాలో 18 ఏళ్లు పైబడిన వారిలో 64 శాతం మంది కనీసం ఒక డోసు టీకా వేయించుకున్నారు.

మిగిలిన వారిలో కొందరు మాత్రమే టీకా వేసుకునేందుకు రెడీగా వుండగా… ఎక్కువ మంది నో అనడం సమస్యగా మారింది.మరి ఈ ఇబ్బందిని బైడెన్ ఏ రకంగా పరిష్కరిస్తారో వేచి చూడాలి.

#North #Kovid Virus‌ #Joe Biden #Tennessee #Corona Vaccine

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు