రెండు నెలలుగా కోమాలోనే.. ఆశలు వదులుకున్న వేళ, కోవిడ్‌ను జయించిన ఎన్ఆర్ఐ డాక్టర్

మందే లేని కరోనా మహమ్మారి నుంచి కాస్తయినా కోలుకుని, ప్రపంచం ఇలా వుందంటే అది ఖచ్చితంగా డాక్టర్ల చలవే.వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఈ భూమ్మీద ప్రతి మూలన డాక్టర్లు , వైద్య సిబ్బంది విరామం లేకుండా పనిచేస్తున్నారు.

 Covid And 2 Month Coma: Indian-origin Doctor In Uk On Miracle Recovery, Indian-o-TeluguStop.com

ఈ సమయంలో తమ కుటుంబాలకు కూడా దూరమై విధుల్లో వున్న వారు ఎందరో.వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.

అయితే వైరస్ నుంచి కాపాడే యత్నంలో ఎంతోమంది డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు ప్రాణాలు కోల్పోగా.మరికొందరు ఇప్పటికీ మృత్యువుతో పోరాడుతున్నారు.

ఈ క్రమంలో కోవిడ్ సోకి కోమాలోకి వెళ్లి, డాక్టర్లు, కుటుంబసభ్యులు ఆశలు వదులుకున్న వేళ.ఓ భారత సంతతి డాక్టర్ కోలుకుని ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు.

వివరాల్లోకి వెళితే.భారత్‌కి చెందిన డాక్టర్ అనూష గుప్తా (40) కుటుంబం యూకేలో స్థిరపడింది.ఈ ఏడాది మార్చిలో తన 40వ పుట్టినరోజును కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఎంతో ఘనంగా జరుపుకున్న అనూష కోవిడ్ బారినపడ్డారు.ఆ తర్వాత ఆకస్మాత్తుగా ఆమె ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేర్చారు.

అనూష ఆక్సిజన్ లెవల్స్ దాదాపు 80 శాతానికి పడిపోవడంతో పాటు కోమాలోకి వెళ్లిపోయారు.అయినప్పటికీ ఆమెకు వైద్యులు నిత్యం చికిత్స అందిస్తూనే ఉన్నారు.

అలా దాదాపు రెండు నెలలు కోమాలోనే ఉండటంతో డాక్టర్లు, కుటుంబసభ్యులు సైతం ఆశలు వదులుకున్నారు.కోవిడ్ ట్రీట్‌మెంట్‌లో చివరి దశగా భావించే ఎక్మో ( ఎక్స్‌ట్రా కార్పోరల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ మెషీన్‌) సపోర్ట్‌తో అనూష దాదాపు 35 రోజులు వున్నారు.

అయితే ఆశ్చర్యకరంగా ఆమె కోలుకోవడంతో డాక్టర్లు, ఫ్యామిలీ మెంబర్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

Telugu Anusha Gupta, Coma, Corona Wave, Covid, Covidcoma, Covid Uk, Indian Origi

అనంతరం అనూష మీడియాతో మాట్లాడుతూ.తాను ప్రాణాలతో బయటపడటంతో కుటుంబం, భర్త చాలా ఆనందంగా ఉన్నారని.ఇది తన జీవితంలో జరిగిన అద్భుతమని ఆమె వివరించారు.

తాను ఐసీయూలో చేరినప్పుడు.తనను వెంటిలేటర్ పై ఉంచినట్లుగా నర్స్ చెప్పిందని ఆ విషయం తనకు ఇంకా గుర్తుందని అనూష పేర్కొన్నారు.

తాను ఆస్పత్రిలో చేరేనాటికి తన కుమార్తె వయసు 18 నెలలు అని.వాట్సాప్ లో వీడియో కాల్ చేసి.బిడ్డను చూసానని ఆమె ఉద్వేగానికి గురయ్యారు.తన కుటుంబం మద్దతు వల్లే ఇప్పుడు ప్రాణాలతో తిరిగి రాగలిగానని అనూష స్పష్టం చేశారు.

ఇకపోతే ప్రస్తుతం భారతదేశాన్ని కుదిపేస్తోన్న సెకండ్ వేవ్ గురించి ఆమె స్పందిస్తూ.కేసుల సంఖ్య తగ్గాలంటే కఠినమైన లాక్‌డౌన్, సామాజిక దూరం, వ్యాక్సినేషన్ వంటి వాటిని పకడ్బందీగా అమలు చేయాలని అనూష సూచించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube