అమెరికాలో హాస్పటల్స్ కు కొత్త తలనొప్పి..ఇవేం రూల్స్..!!

అమెరికాలో కరోన మహమ్మారి విరుచుకుపడిన తరువాత ఎంతో మంది హాస్పటల్స్ కు క్యూలు కట్టారు.అమెరికా వ్యాప్తంగా ఉన్న హాస్పటల్స్ అన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి.

 Florida, New York To Penalize Hospitals , Us, America, Hospitals, Covid Vaccines-TeluguStop.com

హాస్పటల్ బెద్స్ ఖాళీలు లేక పోవడంతో బయట ఉన్న లాన్ లలో టెంట్ లు వేసి మరీ రోగులకు అలుపెరుగకుండా వైద్య సేవలు అందించారు వైద్యులు , హాస్పటల్ వర్గాలు.ప్రభుత్వం నుంచి సరైన సాయం అందకపోయినా తమ సొంత ఖర్చులు భరించి మరీ రోగులకు సేవలు అందించాయి.

వైద్యులు ప్రాణాలు లెక్క చేయకుండా కరోనా తో అలుపెరుగని యుద్ధం చేసి రోగులను రక్షించారు.అయితే
కరోనా వ్యాక్సిన్ వచ్చిన తరువాత ఈ వ్యాక్సిన్ ను అమెరికా ప్రజలకు అందించే విషయంలో హాస్పటల్స్ పై ఒత్తిడి తీవ్రంగా ఉంటోంది.

వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా పంపిణీ విషయంలో సరైన అవగాహన లేకపోవడంతో వ్యాక్సిన్ హాస్పటల్స్ లోని ఫ్రిజ్ లలో మూలుగుతోంది.ఈ పరిస్థితి న్యూయార్క్, ఫ్లోరిడా రాష్ట్రాలలో అత్యధికంగా కనిపిస్తోంది.

దాంతో ఆయా రాష్ట్రాల గవర్నర్లు హాస్పటల్స్ పై మండిపడుతున్నారు.వ్యాక్సిన్ తెచ్చి ఇచ్చినా ప్రజలకు అందించడంలో మీరు వైఫల్యం చెందుతున్నారు.వారంలోగా ప్రజలకు టీకాలు అందించకపొతే హాస్పటల్స్ పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు…

Telugu America, Corona Control, Covid, Florida, Hospitals, Yorkpenalize-Telugu N

ప్రభుత్వ ప్రకటనతో హాస్పటల్ వర్గాలు ఆవేదన చెందుతున్నాయి.కరోనా సమయంలో ఎంతో కష్టపడి పనిచేశామని వ్యాక్సినేషన్ విషయంలో ప్రజలు ముందుకు రాకపోవడంతో వ్యాక్సిన్ లు మిగిలిపోతున్నాయని అందుకు తమని భాద్యులును చేస్తే ఎలా అంటూ ఆవేదన చెందుతున్నారు.అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ మాత్రం ఇప్పటి వరకూ అమెరికా వ్యాప్తంగా వ్యాక్సినేషన్ 50 శాతం కూడా పూర్తవ్వలేదని తెలిపింది.వ్యాక్సినేషన్ వేగవంతంగా అవడానికి హాస్పటల్స్ కు అదనపు నర్సులు అవసరం ఉంటుందని ప్రభుత్వం అందుకు ఏర్పాట్లు చేయాలని సూచించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube