కోవిడ్ వ్యాక్సిన్ ధర నిర్ణయించిన కేంద్రం.. ఎంతంటే.. ?

దేశంలో కరోనా వైరస్‌ను అరికట్టెందుకు టీకాను తయారు చేసిన భారత్ ఇప్పటి వరకు ఈ వ్యాక్సిన్‌ను ఆరోగ్యకార్యకర్తలకు, పోలీసు వంటి పబ్లిక్ రిలేషన్ ఉన్న ఉద్యోగులకు ఉచితంగా అందచేసింది.ఇకనుండి అందరికి అందుబాటులో కరోనా టీకా ఉండే విధంగా, కరోనా వ్యాక్సిన్ ధరను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందట.

 Covid 19, Vaccine, Price Released, Central Govt, Covid Vaccine Price In Private-TeluguStop.com

ఈ క్రమంలో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఒక్కో డోసు ఖరీదును గరిష్టంగా రూ.250 గా ప్రభుత్వం ఖరారు చేసిందట.కాగా ఈ వ్యాక్సిన్‌ ధర రూ.150 కాగా సర్వీస్‌ ఛార్జ్‌ రూ.100 తో కలుపుని రూ.250 గా నిర్ణయించిన ప్రభుత్వం ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కూడా దీని ధర 250 కంటే మించకూడదని స్పష్టం చేసిందట.

ఇకపోతే మార్చి 1 నుంచి ప్రారంభమయ్యే మూడో దశ వ్యాక్సినేషన్స్‌కు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారట.ఇక వ్యాక్సినేషన్‌ తదుపరి ప్రక్రియ దేశవ్యాప్తంగా 10,000 ప్రభుత్వ దవాఖానలతో పాటు 20,000కు పైగా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేశామని, అయితే ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా వ్యాక్సిన్‌ ఇస్తుండగా, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మాత్రం ఈ టీకాకు డబ్బు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube