ప్రైవేట్ ల్యాబ్స్ లో నిలిపివేసిన కరోనా పరీక్షలు,కారణం!  

Covid-19 tests stalled in Private labs in Hyderabad,corona virus,Private labs,hyderabad,corona cases - Telugu Corona Cases, Corona Virus, Covid-19 Tests Stalled In Private Labs In Hyderabad, Hyderabad, Private Labs

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి కి ఇప్పటికే ఎంతోమంది బలైపోతున్న సంగతి తెలిసిందే.రోజు రోజుకు ఈ కేసులు పెరుగుతుండడం తో పాటు రికవరీ రేటు కూడా ఆశించిన స్థాయి లో ఉండడం తో కొంతవరకు ఆనందపడాల్సిన విషయం.

 Covid 19 Tests Stalled Private Labs Hyderabad

అయితే దేశంలోని తెలంగాణా రాష్ట్రంలోకూడా కరోనా కేసులు తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నాయి.ఒకపక్క కేసులు పెరుగుతున్న ఈ సమయంలో ఆ రాష్ట్రంలోని ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా పరీక్షలు నిలిచిపోనున్నట్లు తెలుస్తుంది.

జూలై 2 నుంచి 5 వరకు తాత్కాలికంగా పరీక్షలను నిలిపివేస్తున్నట్లు ప్రైవేట్ ల్యాబ్స్ ప్రకటించాయి.అయితే దీనికి ప్రధాన కారణం కొవిడ్ టెస్టుల్లో ఖచ్చితత్వం లేకపోవడం, ఫలితాల్లో స్పష్టత లేదన్న ఆరోపణల నేపథ్యంలో ప్రైవేట్ ల్యాబ్స్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ప్రైవేట్ ల్యాబ్స్ లో నిలిపివేసిన కరోనా పరీక్షలు,కారణం-General-Telugu-Telugu Tollywood Photo Image

సిబ్బందికి కరోనా శాంపిల్స్ సేకరణపై శిక్షణ, శానిటైజేషన్ కార్యక్రమాల కోసం కరోనా పరీక్షలను నాలుగు రోజుల పాటు నిలివివేస్తున్నాయి.ఐతే ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బంది శాంపిల్స్‌ సేకరించి పంపిస్తే పరీక్షలు నిర్వహిస్తామని.

కానీ నేరుగా ల్యాబ్‌కు వచ్చి పరీక్షలు చేయించుకునే వారి శాంపిల్స్ మాత్రం సేకరించమని ల్యాబ్స్ లు స్పష్టం చేశాయి.తెలంగాణలో మొత్తం 18 ప్రైవేటు ల్యాబ్‌లకు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఐసీఎంఆర్ అనుమతి ఇవ్వగా, గత 15 రోజులుగా ప్రైవేట్ ల్యాబ్స్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి.

ఐతే ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ అధికారుల బృందం ప్రైవేటు ల్యాబ్‌ల కరోనా పరీక్షల నిర్వహణను పరిశీలించి లోపాలను గుర్తించింది.

కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఐసీఎంఆర్ మార్గదర్శకాలు పాటించడం లేదని ఇప్పటికే 12 ల్యాబ్ లకు నోటీసులు ఇవ్వడం తో పాటు 48 గంటల్లో లోపాలను సవరించు కోవాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటికే కొన్ని ల్యాబ్‌లు తప్పులను సరిదిద్దుకున్నాయి.మరికొన్నింటిలో మాత్రం ఇప్పటికీ మార్పురాలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో ప్రైవేట్ ల్యాబ్స్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

#Hyderabad #Corona Virus #Corona Cases #Private Labs

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Covid 19 Tests Stalled Private Labs Hyderabad Related Telugu News,Photos/Pics,Images..