కేసీఆర్ చెప్పినా లెక్కలేదా ? వారికీ అంత భయం వేస్తోందా ?

పార్టీలోనూ ప్రభుత్వంలోనూ తమ నిర్ణయమే అంతిమం గా వ్యవహరిస్తూ వస్తున్నారు.కెసిఆర్ కు ఇప్పుడు సొంత పార్టీ నాయకుల నుంచి సరైన సహకారం లభించడం లేదు.

 Trs Leaders Are Not To Support To Telangan Cm Kcr Instructions, Covid 19, Telang-TeluguStop.com

కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి పార్టీ నాయకుల పనితీరుపై సూచనలు, సలహాలు ఇచ్చినా నాయకులు మాత్రం పెడచెవిన పెడుతున్నారు.ఇప్పుడు ఈ అంశం తెలంగాణలో తీవ్ర చర్చగా మారింది.

ముఖ్యంగా కరోనా విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో పార్టీ శ్రేణులను హెచ్చరించారు.నేను సూటిగా అడుగుతున్నా ఇలాంటి విపత్కర సమయంలో టిఆర్ఎస్ నాయకులు బయటకు రావద్దా అంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజలకు మార్గదర్శకం చేయడం ఉండదా ? పోలీసులకు సహకారం అందించాని కేసీఆర్ పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు.

కరోనా విషయంలో చేసేదేమీ లేక పోయినా జన సంచారం లేకుండా చూడడంతో పాటు, ప్రజలకు ఈ విషయంపై అవగాహన కల్పించడం ఒక్కటే మార్గం అని కేసీఆర్ పదేపదే చెబుతున్నారు.ఈ నేపథ్యంలో ప్రజా ప్రతినిధులంతా ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రజలు రోడ్ల మీదకు రాకుండా చూసుకోవాలని, పోలీసులకు, వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ సహకారం అందించాలని గట్టిగానే చెప్పారు.

దీంతో కొంతమంది ప్రజాప్రతినిధులు కెసిఆర్ ఆదేశాలను పాటించగా మిగతా వారు మాత్రం ఇవేవీ పట్టనట్టుగా వ్యవహరించారు.కారోనా కారణంగా ప్రజాప్రతినిధుల్లో ఎక్కువమంది ఇళ్లకే పరిమితం అయిపోయారు.

Telugu Corona, Covid, Kcrgive, Telangan Cm Kcr, Trs, Trs Mlas Mlcs-Political

కొంతమంది మాత్రం మొక్కుబడిగా బయటకు వచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చి సైలెంట్ అయిపోయారు.ఈ విషయం కెసిఆర్ కు కూడా సమాచారం అందడంతో ఆయన ప్రజా ప్రతినిధులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నట్టు తెలుస్తోంది.ఇటువంటి విపత్కర సమయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎలా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.ఈ విషయంలో కేసీఆర్ ఎటువంటి కఠిన ఆదేశాలు జారీ చేస్తాడో అనే ఆందోళన ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల్లో కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube