కరోనా పై ఆసక్తికర అంశాలను వెల్లడించిన ఐసీఎంఆర్!

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఐసీఎంఆర్ మరింత సమాచారం వెల్లడిస్తూనే ఉన్న విషయం తెలిసిందే.కరోనా పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,చర్యలు వంటి పలు అంశాలపై వివరాలను వెల్లడిస్తూ వస్తున్న ఐసీఎంఆర్ తాజాగా మరికొన్ని ఆసక్తికర అంశాలను వెల్లడించింది.

 Covid-19 Reinfection Likely If Antibodies Reduce Within 5 Months Of Recovery Say-TeluguStop.com

ఒకసారి కరోనా సోకి, నయమైన వాళ్లల్లో యాంటీ బాడీలు వస్తాయి అన్న విషయం తెలిసిందే.అయితే ఈ యాంటీ బాడీలు కరోనా సోకి తగ్గిన వారిలో ఉండడం తో వారికి మళ్లీ తిరిగి కరోనా రాదని అనుకుంటున్నాం.

కానీ ఐసీఎం ఆర్ మాత్రం కరోనా సోకి తగ్గిన వారిలో ఐదు నెలల్లో గనుక యాంటీ బాడీలు తగ్గితే మాత్రం వారికి తిరిగి కరోనా సోకే ప్రమాదం ఉందంటూ ఐసీఎంఆర్ హెచ్చరిస్తుంది.చాలామంది కరోనా నుంచి కోలుకున్న వారు చాలా ధైర్యంగా ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా వ్యవహరిస్తూ ఉంటారు.

భౌతిక దూరం పాటించడం,మాస్క్ ధరించడం వంటి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రవర్తించే వారిని ఐసీఎం ఆర్ హెచ్చరిస్తుంది.ఒకసారి కరోనా వచ్చి తగ్గినప్పకిటికీ కూడా వారిలో యాంటీబాడీలు గనుక ఐదు నెలల్లోనే తగ్గితే మరోసారి వారు కరోనా బారిన పడే అవకాశాలు ఉన్నాయి అని ఐసీఎంఆర్ వెల్లడించింది.

అందుకే, ఒకసారి కరోనా నయమైనా గానీ మాస్కు ధరించడం తప్పనిసరి అని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ తెలిపినట్లు తెలుస్తుంది.ఇలాంటి కేసులు ముంబయిలో రెండు, అహ్మదాబాద్ లో ఒకటి నమోదయ్యాయని ఐసీఎంఆర్ అధికారులు వెల్లడించారు.

అందుకే కరోనా వచ్చి తగ్గిన వారు సైతం తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలి అని లేదంటే చాలా ప్రమాదం అంటూ హెచ్చరిస్తున్నారు.డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం ఇలాంటి రీ ఇన్ఫెక్షన్ కేసులు ఇప్పటివరకు 24 వరకు నమోదు అయినట్లు సమాచారం.

అందుకే కరోనా విషయంలో ప్రతి ఒక్కరూ తప్పని సరిగా జాగ్రత్తలు పాటించాలి అంటూ అధికారులు సూచిస్తున్నారు.

మరోపక్క నిన్న(మంగళవారం) ప్రధాని నరేంద్ర మోడీ జాతి నుద్దేశించి మాట్లాడుతూ కరోనా ఇంకా వెంటాడుతూనే ఉంది అని,ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి అంటూ సూచనలు చేసిన విషయం విదితమే.

అలానే ప్రపంచ వ్యాప్తంగా కూడా కొన్ని దేశాల్లో కరోనా రీ ఇన్ఫెక్షన్ కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే.అందుకే భారత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ ప్రధాని సైతం సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube