రాష్ట్రంలో రెడ్ అలర్ట్.. నిజమెంత?

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రత ఎంత దారుణంగా మారిందో అర్థమవుతుంది.గత ఏడాది కంటే ఈ ఏడాది వైరస్ తీవ్రత రెట్టింపుగా ఉంది.

 Covid 19 Red Alert In Ap Is It True , Andhra Pradesh, Corona, Red Alert, Covid 1-TeluguStop.com

అంతేకాకుండా వైరస్ లక్షణాలు కూడా కాస్త తీవ్రంగా ఉండటంతో పాటు.వేగంగా వ్యాపిస్తుంది.

రోజుకు లక్షల కేసులు నమోదవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అంతేకాకుండా వ్యాక్సిన్ వల్ల కూడా వైరస్ సోకుతుందని పలుచోట్ల వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే మహారాష్ట్ర లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు.తెలుగు రాష్ట్రాల్లో కూడా విజృంభణ ఎక్కువగా మారింది.తెలంగాణలో కర్ఫ్యూ విధించగా, ఆంధ్రప్రదేశ్ లో పలు రాకపోకలు బంద్ చేశారు.ఇదిలా ఉంటే తాజా అధ్యయనం ప్రకారం బుధవారం ఒక్కరోజే దాదాపు 10 వేల కేసులు నమోదయ్యాయి.

రికార్డు ప్రకారం 35 మంది చనిపోయారు.

Telugu Andhra Pradesh, Ap Corona, Corona, Corona Wave, Corona Vaccine, Covid, Re

గత ఏడాది వైరస్ విజృంభణ ఎక్కువగా ఉన్నా కూడా ఇంత తీవ్రంగా కేసులు పెరగలేదు.ప్రస్తుతం పలు రాష్ట్రాలలో రోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండగా శ్రీకాకుళంలో 1500, గుంటూరులో 1236, చిత్తూరులో 1180, కర్నూలులో 958, నెల్లూరులో 936, అనంతపురం 849, తూర్పుగోదావరి 830 కేసులు నమోదయ్యాయి.

ఇక వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పలు ఏర్పాటు చేయగా, వ్యాక్సిన్ అందుబాటు సరైన సమయంలో లేనందున సమస్యలు మరింత తీవ్రంగా మారుతున్నాయి.

అంతేకాకుండా లక్షల మందికి డోసు లు కూడా సరిపోవడం లేదు.ఇక పరిస్థితి మరింత తీవ్రంగా మారడంతో రాష్ట్రాలలో రెడ్ అలర్ట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదా అర్థం కాని పరిస్థితిగా మారింది.

గత కొన్ని చోట్ల లాక్ డౌన్ విధించగా.కొన్ని ప్రాంతాల్లో పలు జాగ్రత్తలతో ప్రజలు తమ పనులలో బిజీగా ఉంటున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube