కరోనా రోడ్, ఎక్కడో తెలుసా…  

Covid 19 Maharastra Ahamadh Nagar - Telugu Coronaroad 2020, Coronavirus, Covid-19, Maharastra Ahamadh Nagar, Mandva, Uttarpradesh

కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచ మొత్తం కూడా ఈ వైరస్ గురించే ఎక్కువగా చర్చించుకుంటుంది.చిన్నా,పెద్ద అన్న తేడా లేకుండా ఎవరి నోట విన్నా కూడా కరోనా పేరే వినిపిస్తుంది అంటే అతిశయోక్తి కాదు.

 Covid 19 Maharastra Ahamadh Nagar

కోవిడ్, మాస్కులు, భౌతిక దూరం, హైడ్రాక్సీ క్లోరోక్విన్, పీపీఈ, క్వారంటైన్, ఐసొలేషన్ వంటివెన్నో జనం నోళ్లలో నానుతున్నాయి.చివరకు నవమాసాలు మోసి కంటున్న పిల్లలకు కూడా మరే పేరూ దొరకనట్లు కరోనా కుమారి, కోవిద్, లాక్‌డౌన్, శానిటైజర్ అని అంటూ ఇలా ప్రతి ఒక్కటి కూడా కరోనా మాయం అయిపొయింది.

ఇది చాలదన్నట్లు ఇటీవలే నిర్మించిన రోడ్డుకు కూడా ఈ వైరస్ పేరు పెట్టడం విశేషం.కరోనా టైం లో ఈ రోడ్డు ను నిర్మించడం తో మరేపేరు దొరకనట్లు కరోనా పేరు పెట్టారట.

కరోనా రోడ్, ఎక్కడో తెలుసా…-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇంతకీ ఈ రోడ్డు ఎక్కడ ఉంది అని అనుకుంటున్నారా.

అదే మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో.

మాండువా గ్రామంలో నుంచి లక్ష్మి వాడి వరకు రోడ్డు పనులు జరిగేవి.అయితే రోడ్డు పనులు ప్రారంభించగా నిధులు లేక సగంలోనే ఆగిపోయింది.

దీనితో మాండవా గ్రామస్తులు సొంతంగా ఈ పని తలపెట్టి,లాక్ డౌన్ లో మరే పని లేకపోవడం తో అందరూ కలసి రోడ్డును పూర్తి చేశారు.కరోనా కల్లోల కాలంలో ఈ రోడ్డును నిర్మించుకున్నారు.

అయితే కరోనా ప్రపంచ దేశాలకు నష్టం చేకూర్చినా ఆ గ్రామస్తులకు మాత్రం మంచే చేసింది.అందుకే దానికి ‘ధన్యవాదాలు’ చెబుతూ రోడ్డుకు కరోనా రోడ్ అని నామకరణం చేశారు.

‘కోరోనా రోడ్ 2020’ అని తాటికాయంత అక్షరాలతో పెద్ద సైన్ బోర్డు కూడా నిలబెట్టారు.దీంతో రోడ్డుపై వెళ్లే కొత్తవాళ్లు మొదట జడుసుకుంటున్నా, ఆ తర్వాత విషయం తెలిసి నవ్వుకుంటున్నారు.

ఇదో ముచ్చటైతే ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జల్లాలో ఇప్పటికే కోరౌనా అనే ఊరొకటి ఉన్న విషయం తెలిసిందే.అయితే ఈ మహమ్మారి ప్రపంచానికి తెలిసినప్పటి నుంచి ఆ ఊరుకి వెళ్ళడానికి కూడా చాలా మంది భయపడిపోతున్నారు.

మొత్తానికి ఈ కరోనా వైరస్ వల్లే కాకుండా పేరుకు కూడా చాలా మంది భయపడిపోతున్నారు అన్నమాట.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Related Telugu News,Photos/Pics,Images..