ఏపీలో తొలి కరోనా మరణం... 150కి చేరువగా పాజిటివ్ కేసులు

రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది.మర్కజ్ ప్రార్ధనలలో పాల్గొన్న వారి కారణంగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

 One Person Died In Ap With Corona, Corona Effect, Covid-19, Lock Down, Ap, Coron-TeluguStop.com

ప్రార్ధనలలో పాల్గొన్నవారు స్వచ్చందంగా వచ్చి కరోనా పరీక్షలు చేసుకొని కారణంగా వీరి వలన మరింత మందికి వ్యాపించి ఉంటుందని భావిస్తున్నారు.ఇదిలా ఉంటే తెలంగాణలో ఇప్పటికే కరోనా మృతుల సంఖ్య పదికి చేరువైంది.

ఇక ఏపీలో కరోనాతో గురువారం కరోనాతో తొలి మరణం నమోదైంది.ఈ విషయాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

ఇటీవల దిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని విజయవాడకు వచ్చిన ఒక వ్యక్తికి కరోనా వైరస్‌ సోకిందని, అతని తండ్రి చనిపోయారని చెప్పారు.

మరణానంతరం పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్‌ అని తేలిందని వెల్లడించారు.

ఇక ఏపీలో నిన్న ఒక్కరోజే కొత్తగా 38 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 149కి చేరింది.

సోమవారం రాత్రి 10 గంటల వరకు 43 కేసులే నమోదవగా, ఆ తర్వాత మూడు రోజుల్లో అదనంగా 106 కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 24 కేసులు, తర్వాత కృష్ణాలో 23, గుంటూరు జిల్లాలో 20 కేసులు ఉన్నాయి.

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసూ నమోదు కాలేదు.ఇక కరోనా టెస్టింగ్ సెంటర్ ల సంఖ్య కూడా ఏపీలో పెంచారు.

౦.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube