టిక్ టాక్ వీడియో చేసిన కరోనా పేషెంట్! అధికారులు సీరియస్  

Covid 19 Infected Patient Makes Tik Tok - Telugu Corona Virus, Covid-19 Infected Patient Makes Tik Tok , Lock Down, Quarantine

ఈ మధ్య కాలంలో టిక్ టాక్ సోషల్ మీడియా మూవీ యాప్ ఎంతగా పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే.దీని ద్వారా చాలా మంది తమ టాలెంట్ చూపించుకుంటూ ఉండగా, మరికొంత మంది పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తూ ఫేమస్ అయిపోతున్నారు.

 Covid 19 Infected Patient Makes Tik Tok Videos

ఓ విధంగా చెప్పాలంటే అమ్మాయిలకి టిక్ టాక్ ఒక వ్యసనం క్రింద మారిపోయింది.సమయం, సందర్భం లేకుండా టిక్ టాక్ వీడియోలు చేస్తున్నారు.

తాజాగా కరోనా సోకినా ఓ యువతీ హాస్పిటల్ లో బెడ్ మీద ఉండకుండా అక్కడ ఉద్యోగులకి మస్కా కొట్టి వారితో కలిసి టిక్ టాక్ వీడియో చేసింది.ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు రంగంలోకి దిగి సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.

టిక్ టాక్ వీడియో చేసిన కరోనా పేషెంట్ అధికారులు సీరియస్-General-Telugu-Telugu Tollywood Photo Image

తమిళనాడులోని అరియలూరు ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువతి వేలాచేరిలోని ప్రముఖ ఫినిక్స్ మాల్ లో ఉద్యోగం చేస్తుంది.ఈమె మార్చి 24వ తేదీ చెన్నై నుంచి తిరిగి వచ్చింది.

చెన్నై నుంచి వచ్చిన యువతికి జ్వరం ఎక్కవగా ఉండటంతో ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించారు.అందులో ఆమెకి పాజిటివ్ రావడంతో అరియలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్ మహిళా వార్డుకు తరలించారు.

ఆమెకి చాలాకాలంగా టిక్ టాక్ వీడియోలు చేసే అలవాటు ఉండటంతో హాస్పిటల్ లో సైలెంట్ గా ఉండలేకపోయింది.హాస్పిటల్ లో అపారిశుద్ద కార్మికులకి మాయమాటలు చెప్పి టిక్ టాక్ వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

టిక్ టాక్ వీడియోలను చూసిన నెటిజన్లు అరియలూరు ప్రభుత్వ ఆసుపత్రి సీనియర్ వైద్యులకు సమాచారం ఇచ్చారు.దీనితో వెంటనే స్పందించిన వైద్యులు ముగ్గురు సిబ్బందిపై చర్యలు తీసుకోవడంతో పాటు వారికి కూడా కరోనా పరీక్షలు చేసారు.

వారికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయితే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని తెలియజేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Covid 19 Infected Patient Makes Tik Tok Videos Related Telugu News,Photos/Pics,Images..