ప్రపంచంలో అత్యధిక కరోనా వైరస్ కేసులున్న దేశాల్లో మన స్థానం ఎంతంటే...

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తుండడం ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది.కాగా భారత దేశంలో ఇప్పటి వరకు నమోదైన  కరోనా వైరస్ పాజిటివ్ కేసుల గణాంకాలను ఒకసారి పరిశీలించినట్లయితే ఇప్పటివరకు 2,46,628 కేసులు దేశ వ్యాప్తంగా నమోదు కాగా ఇందులో లక్షా ఇరవై వేల మంది విజయవంతంగా ఈ కరోనా వైరస్ బారి నుంచి కొలుకోగా, ఆరు వేల పైచిలుకు మంది మరణించారు.

 Covid-19, Corona Virus, Covid-19 Cases, India,-TeluguStop.com

మరో లక్షా ఇరవై వేల పైచిలుకు  కేసులు యాక్టీవ్ గా ఉన్నాయి.  ఈ గణాంకాలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి.

కాగా మొదట్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదయినటువంటి ప్రపంచ దేశాల లిస్టులో భారతదేశం దాదాపుగా అట్టడుగు న ఉండేది.ఇప్పుడు అది కాస్తా ఐదవ స్థానానికి ఎగబాకింది.

దీంతో కొంతమంది వైద్య నిపుణులు కొంతమేర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అంతేకాక కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ 5.0 సడలింపులలో భాగంగా చేపట్టినటువంటి కార్యాచరణలను అమలు చేయడంలో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని అందువల్లనే దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇలాగే రోజురోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతూ పోతే భవిష్యత్తులో భారత్ పలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని కాబట్టి కనీసం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు సరైన నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలని ప్రభుత్వ అధికారులకు సూచిస్తున్నారు.

ఒకప్పుడు ఇటలీ, న్యూజిలాండ్ వంటి దేశాలు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల విషయంలో మనకంటే ముందు ఉండేవని కానీ ఇప్పుడు కరోనా వైరస్ ను అరికట్టేందుకు చేపట్టిన చర్యల కారణంగా గత కొద్ది రోజులుగా మంచి ఫలితాలను సాధించాయని కొందరు నెటిజన్లు సోషల్ మాద్యమాలలో వాపోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube