కరోనా ధాటికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు కంగారు పడిపోతున్నారు.చైనా లో మొదలైన ఈ మహమ్మారి వైరస్ మెల్ల మెల్లగా అన్ని దేశాలకి పాకుతున్న నేపధ్యంలో అందరూ హై అలెర్ట్ ప్రకటించారు.
ప్రజలు పిట్టలు రాలినట్టుగా రాలిపోతున్న నేపధ్యంలో దేశాధినేతలకి ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.ఇదిలాఉంటే కరోనానా కాకరకాయా ఎలాంటి విపత్తులు అయినా ఎదుర్కోగలం అంటూ బీరాలు పలికిన అమెరికా సైతం ప్రస్తుతం కరోనా దెబ్బకి విలవిల లాడుతోంది
ఇదిలాఉంటే అమెరికాలో కరోనా ధాటికి మృతి చెందిన వారి సంఖ్య ఇప్పటికి 9 కి చేరుకుంది.
ఈ మరణాలు అన్నీ దాదాపు కాలిఫోర్నియా వాషింగ్టన్ రాష్ట్రాలలో జరిగినవే.అయితే ఆయా రాష్ట్రాలలో కరోనా వైరస్ వచ్చిన వారి సంఖ్య 130 కి చేరుకుంది.
దాంతో వాషింగ్టన్, శాన్ఫ్రాన్సిస్కో, సియాటిల్ వంటి రాష్ట్రాల్లో సైతం హై ఎమర్జెన్సి ప్రకటించాయి ఆయా ప్రభుత్వాలు.
కరోనాని ఎదుర్కుంటామని ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు అమెరికాలో ఫేస్ మాస్క్ లు కూడా పంపిణి చేయలేని పరిస్థితిలో ఉంది.శానిటరీ వాళ్ళు, మాస్క్ లు దొరకక పోవడంతో అమెరికా ప్రజలు అల్లాడి పోతున్నారు.దక్షిణ కొరియా ఇలాంటి దేశాలు రోజుకి వేలాది మందికి కరోనా వరీక్షలు చేస్తూ ఉంటే అభివృద్ధి చెందిన అగ్ర రాజ్యం అయిన అమెరికా కేవలం 3600 మందికి మాత్రమే పరీక్షలు చేయగలుగుతోంది.