జూపార్కులో పులి పిల్లకి కరోనా పాజిటివ్  

Covid 19 America Newark City Tiger Zoo Park - Telugu America, Covid-19, Newark City, Tiger At The Bronx Zoo Tests Positive For Corona Virus

కరోనా వైరస్ తో ప్రపంచం మొత్తం వణికిపోతుంది.అన్ని దేశాలలో లక్షల సంఖ్యలో కరోనా రోగులు, వేల సంఖ్యలో కరోనా మరణాలతో ప్రజలందరిని భయపెడుతుంది.

 Covid 19 America Newark City Tiger Zoo Park

ఈ జెనరేషన్ చూస్తున్న అత్యంత భయానకమైన ప్రకృతి విపత్తు అంటే ఇదే అని చెప్పాలి.మానవ స్వార్ధం వలన వచ్చిందో, లేక తప్పిదం వలన వచ్చిందో అనేది తెలియకుండా ఇప్పుడు ప్రజలందరిని భయపెడుతుంది.

అయితే ఇప్పుడు కరోనా వైరస్ అనేది మనుషుల నుంచి జంతువులకి కూడా వ్యాపించడం అత్యంత ప్రమాదకరంగా మారుతుంది.మనుషులలో కరోనా వస్తే వైద్యం చేయించుకోవచ్చు, కాని జంతువులలో వస్తే దానిని నియంత్రించడం ఇక అయ్యే పని కాదు.

జూపార్కులో పులి పిల్లకి కరోనా పాజిటివ్-General-Telugu-Telugu Tollywood Photo Image

కరోనా వైరస్ మొట్టమొదటిసారి నాలుగేళ్ల పులి పిల్లకి వచ్చింది.కొద్ది రోజుల క్రితం ఓ పిల్లికి, పెంపుడు కుక్కకి కరోనా లక్షణాలు బయటపడ్డాయి.ఇప్పుడు అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలోని బ్రోంక్స్ జంతు ప్రదర్శనశాలకు చెందిన నాడియా అనే నాలుగేళ్ల వయసుగల పులికి కరోనా వైరస్ సోకిందని అమెరికా ఫెడరల్ అధికారులు ప్రకటించారు.జూపార్కు ఉద్యోగి నుంచి పులికి కరోనా వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు.

బ్రోంక్స్ జూపార్కులో నాడియాతోపాటు మరో ఆరు పులులు, సింహాలు అనారోగ్యానికి గురయ్యాయి.దీంతో పరీక్షలు చేయగా ఒక్క నాడియా పులి తప్ప మిగతా జంతువులు కోలుకున్నాయని తేలింది.

దీంతో న్యూయార్క్ లోని బ్రోంక్స్ జూపార్కును మార్చి 16వతేదీ నుంచి మూసివేశారు.పెంపుడు జంతువులు, పశువుల్లో కరోనా వైరస్ ప్రబలడం కొత్త ప్రశ్నలను లేవనెత్తుతుందని జూపార్కు డైరెక్టరు జిమ్ బ్రెహేనీ చెప్పారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tiger At The Bronx Zoo Tests Positive For Corona Virus Related Telugu News,Photos/Pics,Images..