చంద్రబాబు చుట్టూ “కోవర్ట్ ఆపరేషన్”....బిగ్ డీల్ ఇదే   Covert Operation In Tdp Party     2018-04-01   00:10:47  IST  Bhanu C

అధికార దాహం ఎంతకైనా తెగిస్తుంది..ఎన్ని కుట్రలకైనా సరే తెగపడుతుంది..మనతో పాటు ఉంటూనే మన విషయాలని పక్క పార్టీ నేతలకి చేరవేసే ఆపరేషన్స్ ఈ ఎన్నికల సమయంలో చాలా ఎక్కువగానే ఉంటాయి..అయితే అనాధలా వదిలేసిన ఏపీని ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు చేతిలో ప్రజలు పెట్టడానికి కారణం ఆయన అయితేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలదు అనే నమ్మకం ప్రజలలో ఉండబట్టే అయితే..చంద్రబాబు పదివిని చేపట్టిన సంవత్సర కాలం కేంద్రం సయోధ్యగా ఉన్నా సరే మెల్ల మెల్లగా చంద్రబాబు పై పెత్తనం చేయాలనే ఉద్దేశ్యం తో ఏపీ అభివృద్దికి సహకారం అందిచాకుండా చంద్రబాబుని కేంద్రం ఎన్నో సార్లు తన చుట్టూ తిప్పించుకుంటూ ఉంది..అయినా సరే చంద్రబాబు పెట్టుబడుల కోసం తన కుటుంభం మొత్తం ఎపొఏ అభివృద్దికి సమయం వెచ్చించి పెట్టుబడులు వచ్చేలా పాటుబడ్డారు..

అయితే ఎప్పుడైతే ప్రజలకి చంద్రబాబు పై నమ్మకం పెరుగుతూ వచ్చిందో కేంద్రం చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ చేయడం కోసం పోలవరానికి అడ్డు పడటం..బడ్జెట్ లో నిధులు ఇవ్వక పోవడం..ప్రత్యెక ఆంధ్రా ఉద్యమం లేవనెత్తడం వంటి చర్యలకి పూనుకున్నారు..అందుకు తగ్గట్టుగానే ఎలాగైనా చంద్ర‌బాబును వ‌చ్చే ఎన్నిక‌ల్లో గ‌ద్దె దించాల‌ని జ‌గ‌న్‌, ప‌వ‌న్‌, బీజేపీ చేస్తోన్న ప్ర‌య‌త్నాలు, కుటిల ఎత్తులు అన్నీ ఇన్నీ కావు…అందుకే బీజేపి ,జగన్,పవన్ లు మరో అడుగు ముందుకు వేశారు..జగన్ చుట్టూ కోవర్టులని పెట్టారు.. ముఖ్యంగా టీడీపీలో ఉన్న ఓ ప్ర‌ధాన సామాజిక‌వర్గానికి చెందిన వారిలో కొంత‌మంది ఎమ్మెల్యేల‌తో పాటు ఒక‌రిద్ద‌రు మంత్రులనే కోవ‌ర్టులుగా పెట్టిన‌ట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది..

చంద్రబాబు తీసుకునే నిర్ణయాల దగ్గర నుంచీ టీడీపీలోనూ, బాబు చుట్టూ ఏం జ‌రుగుతుంద‌న్న విష‌యాన్ని ఈ కోవ‌ర్టుల ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటున్నార‌ని తెలుస్తోంది…చంద్రబాబు నేత జాగ్రత్తగా ఉన్నా సరే వీళ్ల‌పై మ‌రింత‌గా కాన్‌సంట్రేష‌న్ చేయాల్సిన అవ‌స‌రం ఉందని అంటున్నారు అయితే బాబు చుట్టూ ఎవరెవరు కోవర్ట్ లుగా ఉన్నారు అనే లిస్టు సైతం చంద్రబాబు ముందు ఉండటం గమనార్హం….ఈ కోవర్టులలో చాలా మంది ప్రజా రాజ్యం నుంచీ డంప్ అయిన వాళ్ళేనట.. అయితే వీళ్ళకి వచ్చే ఎన్నికల్లో జనసేన తరుపున టిక్కెట్లు ఇచ్చే భారీ డీల్ కుదరబట్టి చంద్రబాబు విషయాలు బయటకి వెల్లడి చేస్తున్నారని పూర్తి సమాచారం చంద్రబాబు వద్ద ఉందని తెలుస్తోంది..ఏది ఏమైనా సరే చంద్రబాబు ఎప్పుడు తన జాగ్రత్తలో తానూ ఉంటారు..అయినా ఇలాంటి వాళ్ళని చంద్రబాబు తన అనుభవంలో ఎంతో మందిని చూసి ఉంటారని ఈ విషయంలో కంగారు పడవలసిన అవసరం ఏమి లేదని అంటున్నారు టిడిపి నేతలు..