నిమ్స్‎లో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‎ను కట్టడి చేసేందుకు అన్ని దేశాలు కృషి చేస్తున్నాయి.ఇప్పటికే పలుచోట్ల కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి.

 Corona Virus Vaccine, Covaxin, Nims, Clinical Trails, Hyderabad, Icmr, Bharat Bi-TeluguStop.com

తాజాగా హైదరాబాద్‎లోని నిమ్స్ కేంద్రంగా పనిచేస్తున్న వ్యాక్సిన్ తయారీ బృందం మొదటి దశ ట్రయల్స్ ప్రారంభించింది.

క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ఇద్దరు వాలంటీర్లకు వైద్యులు కొవాగ్జిన్ అనే వ్యాక్సిన్‎ను ఇచ్చారు.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), పుణెలోని నేషనల్ ఇన్‎స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‎ఐవీ) సహకారంతో భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేస్తోంది.హైదరాబాద్‎లోని భారత్ బయోటెక్‎కు చెందిన బయోసేఫ్టీ లెవెల్ 3 ప్రయోగశాలలో ఈ టీకాను తయారు చేశారు.

భారత్ బయోటెక్ తయారు చేసిన ఈ వ్యాక్సిన్ మొదటి, రెండో క్లినికకల్ ట్రయల్స్ జరిపేందుకు ఇండియన్ డ్రగ్ రెగ్యులేటరీ అనుమతి ఇచ్చింది.దీంతో కొవాగ్జిన్‎ను డాక్టర్లు విజయవంతంగా నిమ్స్‎లో ఇద్దరు వాలంటీర్లపై ప్రయోగించారు.

ఆ ఇద్దరిని రెండు రోజుల పాటు ఆబ్జర్వేషన్‎లో ఉంచనున్నారు.రెండు వారాల తర్వాత రెండో వ్యాక్సిన్‎ను ప్రయోగించనున్నారు.

దేశవ్యాప్తంగా మొత్తం 12 వైద్య కేంద్రాల్లో వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని ఐసీఎంఆర్ ప్రకటించింది.దేశీయంగా అభివృద్ధి చేస్తున్న తొలి వ్యాక్సిన్ ఇదే కావడంతో అందరి దృష్టి దీనిపైనే పడింది.

ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్‎ను సిద్ధం చేయాలని ఐసీఎంఆర్ భావిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube