కోర్టు ఆగ్రహం .. మరో దారి ఎంచుకున్న సూపర్ స్టార్ !

సూపర్ స్టార్ రజినీకాంత్ రాఘవేంద్ర కల్యాణ మండపం విషయంలో వేసిన పిటిషన్ పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో , వెనక్కి తగ్గారు.మండపానికి చెల్లించాల్సిన రూ.6.50 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో కోర్టును ఆశ్రయించగా.ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నును కట్టాల్సిందేనని, లేదంటే రజనీకాంత్ జరిమానాను ఎదుర్కోవాల్సి వుంటుందని మద్రాస్ హైకోర్టు హెచ్చరించింది.కోర్టు హెచ్చరికల తరువాత, తన క్లయింట్ పిటిషన్ ను వెనక్కు తీసుకున్నారని రజనీ తరఫు న్యాయవాది తెలిపారు.

 Madras Highcourt, Superstar ,rajinikanth, Chennai, Kollywood-TeluguStop.com

అసలు విషయం ఏమిటంటే .చెన్నైలోని కోడంబాక్కం పరిధిలో ఉన్న రాఘవేంద్ర మండపానికి 2019-20లో చెన్నై కార్పొరేషన్ రూ.6.5 లక్షల ఆస్తి పన్ను కట్టాలని నోటీసులు ఇవ్వగా , మార్చి నుంచి లాక్ డౌన్ కారణంగా ఏ విధమైన కార్యక్రమాలూ అక్కడ జరగలేదని, దీంతో ఆదాయం రానందున పన్ను కట్టలేమని కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనక్కి తగ్గారు.

అయితే , రజినీకాంత్ తరపు లాయర్ మాట్లాడుతూ .50 శాతం వరకూ ప్రాపర్టీ ట్యాక్స్ ను తగ్గించే అవకాశం చట్టంలో ఉందని , ఏదైనా ప్రాపర్టీని వినియోగించకుండా కొన్ని రోజుల పాటు అల;అలాగే ఖాళీగా ఉంచితే సగం పన్ను కడితే సరిపోతుందని , దాన్ని వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తాం అని , అలాగే మా పిటిషన్ ను వెనక్కు తీసుకుంటున్నట్టు న్యాయమూర్తికి తెలియజేశాం చెప్పారు.అయితే , సంబంధిత అధికారులు మాత్రం చట్టాల్లో అలాంటి పన్ను తగ్గింపు అవకాశాన్ని కల్పిస్తున్నట్టు తమకు తెలియదని చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube