మన్మోహన్‌ను వదలని 'బొగ్గు' మసి

మాజీ ప్రధాని, మౌన మునిగా పేరుపడిన మన్మోహన్‌ సింగ్‌ను ‘బొగ్గు మసి’ వదలడంలేదు.అది ఇప్పట్లో వదలదు కూడా.

 Court To Consider Summoning Manmohan Singh-TeluguStop.com

మన్మోహన్‌ ప్రధానిగా ఉన్న సమయంలో బద్దలైన బొగ్గు కుంభకోణంలో ఆయన పాత్ర ఏమిటనేది ఇంకా నిర్థారణ కాలేదు.మన్మోహన్‌ అసమర్థ ప్రధానిగా పేరు తెచ్చుకున్నా అవినీతి ప్రధాని అనే పేరు రాలేదు.

కాని బొగ్గు కుంభకోణంలో ఆయన అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది.ఎందుకంటే బొగ్గు శాఖను ఆయనే నిర్వహించారు కాబట్టి.

అప్పట్లో బొగ్గు శాఖ సహాయ మంత్రిగా ఉన్న ప్రముఖ సినిమా దర్శకుడు దాసరి నారాయణరావు కూడా ఈ కుంభకోణంలో నిందితుడిగా ఉన్నారు.ఈ కుంభకోణంలోని పదిహేను మంది నిందితులు కూడా తమకే పాపం తెలియదని, బొగ్గు శాఖను నిర్వహించిన ప్రధాని సూచనల మేరకే తాను పనులు చేశామని చెబుతున్నారు.అందరూ ‘పాపాత్ముడు’ మన్మోహన్‌ అనే చెబుతున్నారు.‘ప్రధాని ఏం చెబితే అదే చేశా’ అని దాసరి కూడా సిబీఐ ఇంటరాగేషన్లో చెప్పారు.జార్ఖండ్‌లోని అమరకొండ ముర్గదంగల్‌ బొగ్గు క్షేత్రాన్ని పారిశ్రామికవేత్త జిందాల్‌కు అక్రమంగా ఇవ్వడమే ఈ బొగ్గు కుంభకోణం.ఇదే కాక మరికొన్ని బొగ్గు గనుల కేటాయింపుల్లోనూ అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి.

బొగ్గు క్షేత్రాలను కట్టబెట్టడంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని సీబీఐ దర్యాప్తులో తేలింది.ఇందులో ఎవరి పాత్ర ఏమిటనేది తేలాల్సిఉంది.ఈ కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టును ‘మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు సమన్లు పంపండి’ అని ఈ కేసులో నిందితుడైన జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా కోరారు.బొగ్గు శాఖను నిర్వహించింది ఆయనే కాబట్టి ఆయనను కూడా కోర్టుకు పిలిపించాలని కోరారు.

కోడా అభ్యర్థనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.వచ్చే నెల రెండో తేదీన ఈ కేసు విచారణకు రానుంది.

మాజీ ప్రధాని ఏం చెబుతారో విన్న తరువాత ఈ కేసు ఏ ములపు తీసుకుంటుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube