అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి ఆదేశ కోర్టు బ్రేకులు వేసింది.మెక్సికో సరిహద్దుల నుంచీ అమెరికాలో ఆశ్రయం పొందటానికి వచ్చే శరణార్థులని రానిచ్చే పరిస్థితి లేదని.
వారిని అడ్డుకోవాలని ఆదేశాలు జారీ చేసిన ట్రంప్ నినయాన్ని అమెరికా కోర్టు తప్పు పట్టింది.
ఎంతో మంది తమ దేశంలోకి రావడంతో అమెరికా వ్యాప్తంగా జనాభాతో నిండిపోతోంది, అసలు అమెరికా వాసులకి ఉద్యోగాలు అందటంలేదు.
ఎన్నో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి, అక్రమాలు పెరిగిపోతున్నాయి వలసదారుల వలన అంటూ ట్రంప్ గత కొంతకాలంగా వాదిస్తూనే ఉన్నారు.ఈ మేరకు అక్రమ వలసదారులని రానివ్వద్దు అంటూ ఆదేశాలు కూడా జారీ చేశారు.
దాంతో ట్రంప్ విధానాన్ని సవాల్ చేస్తూ అమెరికా పౌర హక్కుల గ్రూపులు దాఖలు చేసిన పిటిషన్ పై స్పందిచిన కోర్టు ట్రంప్ నిర్ణయాన్ని తప్పుపట్టింది.అయితే దీనిని ఇప్పటికిప్పుడే అమలు చేయాలనేమి లేదని జడ్జి రిచర్డు సీబార్స్ తెలిపారు.