అసిన్‌కు కోర్టు షాక్‌

తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో నటించి సౌత్‌లో స్టార్‌ అనిపించుకున్న హీరోయిన్‌ అసిన్‌.ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్‌ హీరోలకు జోడీగా నటిస్తూ బిజీబిజీగా ఉంది.

 Court Orders Asin To Give Rs 10 Lakhs-TeluguStop.com

అయితే ఈ అమ్మడు ఒక వివాదాస్పద విషయంతో కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది.కోర్టు ఈమెకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడంతో షాక్‌ తగిలింది.

వివాదం వివరాల్లోకి వెళ్తే… అసిన్‌కు కేరళలో ఒక డబుల్‌ బెడ్‌ రూం ఫ్లాట్‌ ఉంది.ఆ ఫ్లాట్‌ను జయలక్ష్మి ఎర్నాకులం అనే ఇంటీరియర్‌ డిజైనర్‌తో డిజైన్‌ చేయించింది.

అందుకు 10 లక్షలు ఖర్చు అయ్యింది.అయితే ఆ మొత్తాన్ని జయలక్ష్మికి అసిన్‌ ఇవ్వడం లేదట.

చాలా రోజులుగా అసిన్‌ను అడుగుతున్నప్పటికి ఆమె సరిగా స్పందించక పోవడంతో జయలక్ష్మి కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది.జయలక్ష్మి పిటీషన్‌ను స్వీకరించిన కోర్టు విచారణ జరిపింది.

విచారణలో అసిన్‌ది తప్పుగా నిర్ధారించిన కోర్టు జనవరి 14 వరకు జయలక్ష్మి డబ్బు ఇవ్వని పక్షంలో ఆమె ఫ్లాట్‌ను వేయవచ్చని తీర్పు ఇచ్చింది.దాంతో ప్రస్తుతం అసిన్‌ హడావుడిగా జయలక్ష్మికి ఇవ్వాల్సిన మొత్తాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube