జీవిత, రాజశేఖర్ లకు షాకిచ్చిన కోర్టు.. రూ.65 లక్షలు కట్టకపోతే మూవీని ఆపేస్తారా?

ఈ మధ్య కాలంలో జీవిత, రాజశేఖర్ వేర్వేరు వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారనే సంగతి తెలిసిందే.తాజాగా రాజశేఖర్ హీరోగా జీవిత డైరెక్షన్ లో తెరకెక్కిన శేఖర్ మూవీ థియేటర్లలో విడుదలైంది.

 Court Huge Shock To Jeevitha Rajasekhar Details, Jeevitha, Rajasekhar, Sekhar Movie, City Civil Court, 65 Lakh Rupees, Financier Parandhama Reddy, Sekhar Movie Issues, Jeevita Rajasekhar-TeluguStop.com

ప్రముఖ సంస్థల నుంచి ఓటీటీ ఆఫర్లు వచ్చినా ఈ సినిమాను మాత్రం థియేటర్లలోనే విడుదల చేశారు.అయితే మలయాళ మూవీ జోసెఫ్ కు ఈ సినిమా జిరాక్స్ లా ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

క్రిటిక్స్ సైతం శేఖర్ సినిమా ఒకసారి చూడవచ్చు అనేలా ఉందని సినిమాలో పెద్దగా ప్రత్యేకతలు లేవని చెప్పుకొచ్చారు.జీవిత, రాజశేఖర్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి ప్రమోషన్స్ ను నిర్వహించినా ఆ ప్రమోషన్స్ కు తగ్గ ఫలితం దక్కేలా అయితే కనిపించడం లేదు.

 Court Huge Shock To Jeevitha Rajasekhar Details, Jeevitha, Rajasekhar, Sekhar Movie, City Civil Court, 65 Lakh Rupees, Financier Parandhama Reddy, Sekhar Movie Issues, Jeevita Rajasekhar-జీవిత, రాజశేఖర్ లకు షాకిచ్చిన కోర్టు.. రూ.65 లక్షలు కట్టకపోతే మూవీని ఆపేస్తారా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శని, ఆదివారాలలో ఈ సినిమాకు బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవని తెలుస్తోంది.మరోవైపు ఈ సినిమాకు సివిల్ కోర్టు భారీ షాకిచ్చింది.

పరంధామరెడ్డి అనే ఫైనాన్షియర్ జీవిత రాజశేఖర్ తన దగ్గర 65 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారని శేఖర్ సినిమా కోసం తీసుకున్న ఆ మొత్తాన్ని ఆమె తిరిగి చెల్లించలేదని కోర్టుకు వెల్లడించారు.సిటీ సివిల్ కోర్టు ఆదివారం సాయంత్రం 4.30 గంటల లోపు జీవిత 65 లక్షల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ గా కోర్టులో సమర్పించాలని ఆదేశించింది.

జీవిత ఆ డబ్బులు డిపాజిట్ చేయని పక్షంలో శేఖర్ సినిమాకు సంబంధించిన కంటెంట్ ను ఎక్కడా ప్రసారం చేయకూడదని కోర్టు ఆదేశించింది.కోర్టు ఆదేశాలు అమలులోకి వస్తే శేఖర్ సినిమాకు ఇబ్బందులు తప్పవు.కోర్టు ఆదేశాల నేపథ్యంలో జీవిత ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.

ఆర్థిక విషయాల ద్వారా, వివాదాల ద్వారా జీవిత తరచూ వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.కోర్టు ఆదేశాలపై జీవిత ఎలా స్పందిస్తారో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube