జడ్జితో ఆడుకుంటున్న హాజీపూర్ శ్రీనివాస్... నాకు మగతనమే లేదు అంటూ వ్యాఖ్యలు

సైకో శ్రీనివాస్ అలియాస్ హాజీపూర్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అమ్మాయిలకి మాయ మాటలు చెప్పి బైక్ పై ఎక్కుంచుకొని తీసుకెళ్ళి ఆ తరువాత అత్యాచారం చేసి కిరాతకంగా హత్యలు చేసిన అతనిని పోలీసులు పట్టుకొని పక్కా ఆధారాలతో అరెస్ట్ చేశారు.

 Court Hearing On Serial Killer Srinivas Reddy Over Hajipur-TeluguStop.com

ఇక ఈ కేసుని త్వరితగతిన విచారించడానికి తెలంగాణ సర్కార్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఏర్పాటు చేసింది.అయితే పోలీసుల విచారణలో నిజాలు ఒప్పుకున్నా శ్రీనివాస్ ఇప్పుడు కోర్టులో మాత్రం జడ్జ్ ఎంత ప్రశ్నించిన తనకి ఆ హత్యలతో ఎలాంటి సంబంధం లేదని, తాను ఎవరిని అత్యాచారం చేయలేదని పోలీసులు తనని బలవంతంగా ఇరికించారని పదే పదే చెబుతూ న్యాయమూర్తిని బోల్తా కొట్టించే ప్రయత్నం చేస్తున్నాడు.

ఈ హత్య కేసులలో నిందితుడు శ్రీనివాసరెడ్డి వాదనలు మిగిసాయి.ఇక 44 మంది సాక్షులని విచారించి వారి వాంగ్మూలం చదివి వినిపించిన న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డిని పలు విషయాలపై ప్రశ్నించారు.

ఈ క్రమంలో ఎన్ని చెప్పిన కూడా నాకేమీ తెలియదని, వీటితో తనకెలాంటి సంబంధం లేదని, పోలీసులు తనని అన్యాయంగా ఇరికించారని వాదిస్తున్నాడు.పోలీసులు అన్ని అబద్ధాలు చెబుతున్నారని చెప్పుకొచ్చాడు.

అసలు తనకి మగతనమే లేదని, అలాంటిది తాను ఎలా అత్యాచారం చేస్తానని వాదించాడు.పోలీసులే తన నుంచి సిరంజీతో వీర్యం సేకరించి ఆ హత్యలు అన్ని తానే చేసినట్లు నిరూపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాడు.

తనకి అసలు బైక్ నడపడమే రాదని వాదించాడు.ఫింగర్ ప్రింట్స్ కూడా పోలీసులు బలవంతంగా తన నుంచి తీసుకున్నారని చెప్పాడు.

ఇలా అతని వాదనలు విన్న జడ్జ్ ఇంకా ఎలాంటి తీర్పు చెప్పకుండా మరోసారి ఈ నెల 6వ తేదీకి కేసుని వాయిదా వేసారు.అయితే ఇంతని మీద ఆధారాలు అన్ని రుజువు కావడంతో ఉరిశిక్ష పడే అవకాశం ఉంది.

ఈ నేపధ్యంలో అతను రకరకాల కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని మృతుల కుటుంబీకులు అంటున్నారు.వాడికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube