20 మందిని రేప్ చేసి ఆపై సైనేడ్ తినిపించి...  

Court Giving Punishment Life Time Jail To Men - Telugu Karnataka, Karnataka Crime News, Karnataka Latest News, Karnataka Local, Karnataka News, Life Time Jail Men, Life Time Jail News, Life Time Jail To Men

ప్రస్తుత కాలంలో కొందరు కామంతో కొట్టుమిట్టాడుతూ ఎంతకైనా తెగించడానికి సిద్ధపడుతున్నారు.అయితే గతంలో ఓ వ్యక్తి ఏకంగా 20 మంది యువతులను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తర్వాత తన లైంగిక వాంఛలు తీర్చుకుని ఎవరికీ అనుమానం రాకుండా వారి కి సైనేడ్ ఉన్నటువంటి పదార్థాలు తినిపించి హత్య చేసిన ఘటనలో సైనేడ్ మోహన్ అనే వ్యక్తికి మంగళూరు కోర్టు జీవిత ఖైదు విధించింది.

Court Giving Punishment Life Time Jail To Men - Telugu Karnataka, Karnataka Crime News, Karnataka Latest News, Karnataka Local, Karnataka News, Life Time Jail Men, Life Time Jail News, Life Time Jail To Men-Latest News-Telugu Tollywood Photo Image

అంతేగాక ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా కూడా విధించింది.

వివరాల్లోకి వెళితే సైనేడ్ మోహన్ అనే వ్యక్తి కర్ణాటక రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో నివాసం ఉండేవాడు.

ఇతడు అల్లరిచిల్లరిగా తిరుగుతూ అమ్మాయిల వెంట పడుతూ ఉండేవాడు.ఈ క్రమంలో కొంత మంది యువతులను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకునే వాడు.

ఈ క్రమంలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి తన లైంగిక వాంఛలు తీర్చుకునే వాడు.అనంతరం సైనేడ్ పూసినటువంటి పదార్థాలను వారికి తినిపించగా చనిపోయారని నిర్ధారణ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయేవాడు.

ఇలా ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా 20 మందిని చంపేసినట్లు పోలీసులు తెలిపారు.

అయితే ఇది ఇలా ఉండగా గతంలో 2006వ సంవత్సరంలో కూడా కేరళ రాష్ట్రానికి చెందినటువంటి ఓ యువతిని ఇదే తరహాలో నమ్మించి మోసం చేసి చంపిన ఘటనలో పోలీసులు అరెస్టు చేశారు.అనంతరం తమదైన శైలిలో విచారించగా సైనేడ్ మోహన్ ఇంతకు ముందే 20 మందిని చంపినట్లు విచారణలో ఒప్పుకున్నాడు.దీంతో కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరు కోర్టు అతనికి జీవితఖైదు శిక్ష వేసింది.

అయితే ఈ విషయం తెలుసుకున్న టువంటి పలు ప్రజా సంఘాల నాయకులు మంగళూరు కోర్టు తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి లొంగదీసుకుని అనంతరం తన లైంగిక వాంఛలు తీర్చుకుని దారుణంగా హతమార్చిన నిందితుడికి జీవితఖైదు సరిపోదని ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

తాజా వార్తలు

Court Giving Punishment Life Time Jail To Men-karnataka Crime News,karnataka Latest News,karnataka Local,karnataka News,life Time Jail Men,life Time Jail News,life Time Jail To Men Related....