నిందితుల అంత్యక్రియలు వాయిదా

Court Gives Stayed Funeral Disha Accused Funeral

దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది.దీంతో శుక్రవారం వరకు మృతదేహాలు భద్రపరచాలని ధర్మాసనం సూచించింది.

 Court Gives Stayed Funeral Disha Accused Funeral-TeluguStop.com

మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది.

నిజానికి సోమవారం ఉదయమే దీనిపై విచారణ జరపాల్సి ఉంది.

అయితే ఎన్‌కౌంటర్‌పై మరో పటిషన్‌ దాఖలు కావడంతో మధ్యాహ్నానికి వాయిదా వేసింది.తర్వాత రెండు పిటిషన్లు కలిపి ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఎన్‌కౌంటర్ చట్ట విరుద్ధంగా జరిగిందంటూ మహిళా సంఘాలు హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ మొదలుపెట్టింది.

మరోవైపు దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ సెగలు సుప్రీంకోర్టును తాకాయి.దిశ హత్య కేసులో నిందితులను కాల్చి చంపి ఎన్‌కౌంటర్‌గా చెబుతున్నారని, అది బూటకపు ఎన్‌కౌంటర్‌ అంటూ ఇద్దరు లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ ఘటనపై విచారణ జరిపించాలని పిటిషనర్లు జి.ఎస్‌.మణి, ప్రదీప్‌ కుమార్‌ యాదవ్‌ కోరారు.

తమ పిటిషన్‌లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ డీజీపీలతోపాటు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.సి.సజ్జనార్‌లను ప్రతివాదులుగా చేర్చారు.సీబీఐతో దర్యాప్తు జరిపించాలని, లేదా ఇతర రాష్ట్రాలకు చెందిన పోలీస్‌ బృందంతో విచారణ జరిపించాలని విన్నవించారు.

దీనిపై బుధవారం విచారణ జరిపిందేకు న్యాయస్థానం అంగీకరించింది.

#Funeral Disha #Disha #Disha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube