నూతన సంవత్సరం తోలి రోజే మాల్యాకు గట్టి ఝలక్

ఆర్ధిక నేరగాడు గా లిస్ట్ లోకి చేరిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కు ముంబై కోర్టు గట్టి ఝలక్ ఇచ్చింది.వేల కోట్ల రూపాయలు భారత్ లోని పలు బ్యాంకుల్లో రుణాలు తీసుకొని విదేశాలకు చెక్కేసిన సంగతి తెలిసిందే.

 Court Allows Banks To Utilize Seized Assets Of Vijay Malya-TeluguStop.com

ఈ నేపథ్యంలో లండన్ కోర్టు లో దీనిపై విచారణ చేపట్టగా ఇటీవల వేళా కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించాలని లండన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ క్రమంలో ఆయన కు సంబందించిన ఆస్తులను వేలాం వేయాలని కోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో మాల్యా ఆస్తుల వేలానికి బ్యాంకులకు పీఎం ఎల్ ఏ ముంబై కోర్టు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తుంది.అయితే నూతన సంవత్సరంలో అడుగుపెట్టి పెట్టగానే మాల్యా ఆస్తులను వేలం వేయాలి అంటూ ముంబై కోర్టు వెల్లడించడం విశేషం.

అయితే ఈ ఆర్డర్స్ ను జనవరి 18 తరువాత మాత్రమే పాటించాలి అంటూ కోర్టు స్పష్టం చేసింది.

ఈ ఆదేశాల అమలు జరిగే లోపు సంబంధిత పార్టీలు ఈ ఆదేశాలపై ముంబై కోర్టులో అప్పీలు చేసుకోవచ్చని పేర్కొంది.

మాల్యా పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడుగా గత ఏడాది జనవరి 5న పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు ప్రకటించింది.ఆయన ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని కూడా ఆదేశించింది.సీజ్‌ చేసిన ఆస్తుల లిక్విడేషన్‌కు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని గత ఏడాది ఫిబ్రవరిలో పీఎంఎల్ఏ కోర్టుకు ఈడీ తెలియజేయడం తో తాజాగా ముంబై కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube