కండోమ్ కోసం కక్కుర్తి.. ఆసుపత్రి పాలైన జంట  

Couple Uses Plastic Cover In Place Of Condom-couple,safe ,vietnam News,weird News

శృంగారంలో రక్షణగా ఉపయోగించే కండోమ్‌లు నేటి సమాజంలో దాదాపు అందరూ వాడుతున్నారు.అయితే కొంతమంది మాత్రం తమకున్న సిగ్గు, భయం లేదా అవగాహన రహిత జ్ఞానంతో చేసే కొన్ని పనులు వారి పీకల మీదకు తీసుకువస్తున్నాయి.కండోమ్ కొనాలంటే సిగ్గపడ్డ ఓ జంట చేసిన పనికి వారు ఆసుపత్రి పాలైన ఘటన తాజాగా వెలుగు చూసింది.వియాత్నాం దేశంలో శృంగారంలో పాల్గొనేందుకు సిద్ధమైన ఓ జంట కండోమ్ వాడాలంటే సిగ్గు పడ్డారు.

Couple Uses Plastic Cover In Place Of Condom-couple,safe ,vietnam News,weird News Telugu Viral News Couple Uses Plastic Cover In Place Of Condom-couple Safe Vietnam News Weird-Couple Uses Plastic Cover In Place Of Condom-Couple Safe Sex Vietnam News Weird

దీంతో వారు గర్భం రాకుండా జాగ్రత్త తీసుకునేందుకు ఓ ప్లాస్టిక్ కవర్‌ను వాడారు.అది కాస్త వారి ఆవేశానికి అడ్డుగా నిలువలేకపోయింది.దీంతో వారి అవయవాలలో మంట పుట్టింది.అంతేగాక ఆ జంటకు రక్తస్రావం అయ్యింది.

దీంతో వెంటనే ఆ జంట ఆసుపత్రికి పరుగులు తీసారు.అయితే శృంగారంలో అవగాహన లేకుండా చేసిన పని వారి ప్రాణాలమీదకు తెచ్చిందని వైద్యలు తెలిపారు.కాగా వియాత్నాం దేశంలో సురక్షితమైన శృంగారం పట్ల ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయని పలువురు నిపుణులు తెలిపారు.ఏదేమైన శృంగారంలో రెచ్చిపోదామనుకున్న జంట ప్లాస్టిక్ కవర్ పుణ్యమా అని ఆసుపత్రి బెడ్‌పైకి చేరారు.