కరోనా భయంతో దంపతులు ఆత్మహత్య!  

couple, suicide, corona virus, panic, covid 19 - Telugu Corona Virus, Couple, Covid-19, Panic, Suicide

కరోనా వైరస్ ఎంత దారుణంగా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది.

 Couple Suicide Corona Virus Panic

ప్రపంచవ్యాప్తంగా కోటి 80 లక్షలమందికి కరోనా వ్యాపించింది.ప్రపంచ ఆరోగ్య సంస్ద పరిశోధన బట్టి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కరోనా వచ్చి పోతుందని సర్వేలు చెప్తున్నాయి.

ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ వచ్చి కొందరు మరణిస్తుంటే మరికొందరు కరోనా వస్తుందేమో అనే భయంతో మృతి చెందుతున్నారు.ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా భయంతో ఒక జంట ఆత్మహత్య చేసుకుంది.

కరోనా భయంతో దంపతులు ఆత్మహత్య-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ ఘటన అనంతపురంలోని ధర్మవరంలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

ధర్మవరం కు చెందిన దంపతులకు కరోనా వైరస్ సోకింది.దీంతో అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొంది కరోనా నుండి కోలుకున్నారు.

ఆస్పత్రి నుండి ఇంటికి చేరుకున్న వారికి మళ్లీ కరోనా వైరస్ వస్తుందేమో అని బయపడి ఇంటి భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

కాగా కరోనా వైరస్ సోకి వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు మృతిచెందారు.

అయితే దంపతుల ఆత్మహత్య సంఘటన స్థానికులను భయాందోళన కు గురి చేస్తోంది.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

కాగా ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

#Panic #Suicide #Couple #COVID-19 #Corona Virus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Couple Suicide Because Of Coronavirus Panic Related Telugu News,Photos/Pics,Images..