పెళ్లిలో ఆ చెత్త పని చేసిన దంపతులు.. బంధువులు దేహశుద్ధి చేసి!  

ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే ఎంతో హడావిడి వాతావరణం నెలకొంటుంది.ఏ వస్తువులు ఎక్కడ పెట్టారన్న విషయాలను కూడా కొన్నిసార్లు మర్చిపోతుంటారు.

TeluguStop.com - Couple Robs Gold In Relatives Marriage Function In Kamareddy

ఇలాంటి సందర్భాలలో దొంగలు ఆ వస్తువుల పై చేతివాటం ప్రదర్శిస్తుంటారు.ఇలా శుభకార్యాలలో దొంగతనానికి పాల్పడిన ఘటనలు ఎన్నో జరిగాయి.

ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.బంధువుల పెళ్లికి వచ్చిన ఆ దంపతులు తమను ఎవరూ చూడలేదని వధువు తరపు బంధువుల ఆభరణాలను దొంగలించారు.

TeluguStop.com - పెళ్లిలో ఆ చెత్త పని చేసిన దంపతులు.. బంధువులు దేహశుద్ధి చేసి-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

చివరకు ఆ ఆభరణం ఆ దంపతుల దగ్గర బయటపడటంతో వారిని పోలీసులకు అప్పగించిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళితే

కామారెడ్డి జిల్లాలో అయ్యప్ప ఫంక్షన్ హాల్ లో జరిగిన వివాహ వేడుకల్లో దొంగతనం జరిగింది.

బంధువుల ఇంట్లో పెళ్లికి వచ్చిన దంపతులు తమ చేతివాటం చూపించారు.పెళ్లికూతురు తరఫున బంధువుల బంగారు నగలను ఎవరు చూడలేదని భావించి ఆ దంపతులిద్దరూ దొంగతనానికి పాల్పడి మూడు తులాల బంగారు నగను దొంగలించారు.

ఒక్కసారిగా మూడు తులాల బంగారు నగ కనిపించకపోవడంతో పెళ్లి మండపంలో గందరగోళ వాతావరణం ఏర్పడింది.ఈ దంపతులిద్దరూ దొంగతనానికి పాల్పడిన విషయం గమనించిన ఇతర బంధువులు వారిని నిలదీసి, అడగడంతో దొంగలించిన ఆ బంగారు నగ ఆ దంపతుల నుంచి బయట పడింది.

దొంగతనానికి గురైన మూడు తులాల బంగారు నగ ఆ దంపతుల దగ్గర లభించడంతో పెళ్లికి వచ్చిన బంధువులు అందరూ శుభమా అంటూ పెళ్లికి వచ్చి ఈ పాడు పని చేయడమేంటని బంధువులందరూ వారిని చెడామడా తిట్టి,దేహశుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ పెళ్లిలో దొంగతనానికి పాల్పడిన ఆ దంపతులిద్దరూ ఇందిరానగర్ కాలనీకి చెందిన పరమేష్, యశోధలు గా గుర్తించి, వారిపై కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

#Kamareddy #Gold

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Couple Robs Gold In Relatives Marriage Function In Kamareddy Related Telugu News,Photos/Pics,Images..