శ్రామిక్ రైలులో పుట్టిన లాక్ డౌన్ యాదవ్... సోషల్ మీడియాలో వైరల్

లాక్ డౌన్ నుంచి కొన్ని సడలింపులు ఇవ్వడంతో వలస కార్మికులు కేంద్ర ప్రభుత్వం శ్రామిక్ రైళ్ళు ద్వారా వారి సొంత రాష్ట్రాలకి తరలించే ప్రయత్నం చేస్తుంది.ఈ శ్రామిక రైళ్ళు ద్వారా కోట్ల మందిని సొంత గ్రామాలకి చేరవేశారు.

 Couple On Shramik Train Want To Name Newborn Lockdown Yadav, Lock Down, Corona E-TeluguStop.com

అయితే ఇలా వెళ్తున్న వలస కార్మికులలో గర్భిణీ స్త్రీలు కూడా ఉన్నారు.ఇలాంటి వైపరిత్యాలు వచ్చినప్పుడు పుట్టే పిల్లలకి విచిత్రమైన పేర్లు పెట్టిన సందర్భాలు చాలా చూసాం.

ఇప్పుడు అలాగే శ్రామిక్ రైలులో పుట్టిన పండంటి బిడ్డకి వారి తల్లిదండ్రులు లాక్ డౌన్ యాదవ్ అని పేరు పెట్టారు.ఇప్పుడు ఈ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ముంబై నుంచి ఉత్తర ప్రదేశ్ లోని తన స్వస్థలానికి బయలుదేరిన ఉదయ భాన్ సింగ్, రీనా దంపతులు రైలులో బయలుదేరారు.శుక్రవారం రాత్రి సమయంలో నెలలు నిండిన రీనాకు పురిటి నొప్పులు ప్రారంభం కాగా, సాయం చేయాలంటూ ఉదయభాన్ సింగ్, రైల్వే హెల్ప్ లైన్ కు ఫోన్ చేయగా వారు వెంటనే స్పందించారు.

రైలును బుర్హాన్ పూర్ లో ఆపి, ఆమెను ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో ఆమె మగ శిశువును ప్రసవించింది.కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ సమయంలో పుట్టినందున అతనికి లాక్ డౌన్ యాదవ్ అని పేరును పెట్టామని రీనా వెల్లడించారు.తాము ముంబై నుంచి అంబేద్కర్ నగర్ కు వెళ్లాల్సి వుందని, మధ్యలోనే నొప్పులు వచ్చాయని, విషయం తెలుసుకుని సాయం చేసిన అధికారులకు కృతజ్ఞతలని ఆమె తెలిపారు.

మొత్తానికి ఇప్పుడు లాక్ డౌన్ యాదవ్ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అతని పేరు చెప్పిన ప్రతిసారి కరోనా లాక్ డౌన్ అందరికి గుర్తుకోచ్చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube