భర్తకు కరోనా సోకిందని తెలియడంతో భార్య ఏంచేసిందంటే …?

ప్రస్తుత కాలంలో మన పక్కన నుంచుని వెళ్తున్న వ్యక్తికి కరోనా ఉందో లేదో తెలియని పరిస్థితి ఏర్పడింది.

అయితే తాజాగా తూర్పు గోదావరి జిల్లా కరప లో ఓ సంఘటన నిజంగా ఆశ్చర్యానికి గురి చేసింది.

బస్సు ఎక్కి ప్రయాణిస్తున్న వ్యక్తికి కరోనా అని తెలియడంతో సిబ్బంది బస్సులోంచి దించేశారు.

ఇక ఈ విషయానికి సంబంధించి పోలీసుల కథనం ప్రకారం రామచంద్రపురానికి చెందిన 55 ఏళ్ల వృద్ధుడికి కిడ్నీ సమస్య కారణంగా అతడు డయాలసిస్ చేయించుకునేవారు.

అయితే రెండు రోజుల క్రితం అతడికి కరోనా పరీక్షలు నిర్వహించారు.అయితే బాధితుడు గురువారం సాయంత్రం ఆసుపత్రి నుండి భార్యతో కలిసి స్వగ్రామానికి బయలుదేరారు.

బస్సు ఎక్కి ముందు అతడి వివరాలను సిబ్బంది అడిగి తెలుసుకున్నారు.ఇకపోతే బస్సు బయల్దేరాక కరప చేరుతుంది అనగా అతడికి కరోనా సోకినట్టు ఫోన్ వచ్చింది.

అయితే రిపోర్టర్ వచ్చే వరకు ఆసుపత్రిలోనే ఉండాలని ఆసుపత్రి సిబ్బంది చెప్పినా వినిపించుకోకుండా వారు బస్సు ఎక్కి వచ్చారని తెలుస్తోంది.

వెంటనే విషయాన్ని తెలుసుకున్న ఆర్టీసీ అధికారులకు ఫోన్ చేసి ఆ బస్సు డ్రైవర్ కు కండక్టర్ కు విషయం తెలపడంతో వారిని బస్సు నుండి దింపేశారు.

అయితే ఆ సమయానికి బస్సు కరప మార్కెట్ కు చేరుకుంది.కాకపోతే ఆ సమయంలో భార్యాభర్తలను బస్సులోంచి దించేశారు.

భర్తతో పాటు దిగిన భార్య కొద్దిసేపటి తర్వాత కనిపించలేదు.దాంతో బాధితుడు అక్కడే ఉండిపోవలసిన పరిస్థితి ఏర్పడింది.

ఆ తర్వాత పోలీసులు సమాచారం తెలుసుకుని అతడిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అంతేకాకుండా కనిపించకుండాపోయిన తన భార్యని పోలీసులు వెతకడానికి ప్రయత్నిస్తున్నారు.

వైరల్ వీడియో: స్కూల్ కి లేటు వచ్చిన బుడ్డోడు.. ఆలస్యం ఎందుకయిదంటూ ఇచ్చిన సమాధానం..?!