ఆ జంట కారులో అమెరికా టూ హైదరాబాద్‌ వచ్చారు.! అదెలా సాధ్యం అయ్యిందో తెలుసా?

కారులో షికారు అంటే చాలా మందికి ఇష్టమే.ఎంత దూరమైనా సరే వెళ్ళిపోతూ ఉంటారు ట్రావెల్లెర్స్.

 Couple Journey America To Hyderabad Incar-TeluguStop.com

అయితే కార్ లో అమెరికా నుండి హైదరాబాద్ కి ప్రయాణం అంటే అసాధ్యం అనే చెప్పాలి.ఎందుకంటే మధ్యలో సముద్రం ఉంది.

కానీ ఆ జంట అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు.ఎలాగా అని ఆశ్చర్యపోతున్నారా.? వివరాలు మీరే చూడండి!

కాలిఫోర్నియాలోని గృహం నుంచి హైదరాబాద్‌లోని ఇంటి వరకూ కారులో ప్రయాణించాలని నిర్ణయించారు.37 ఏళ్ల వైవాహిక జీవితంలో కోల్పోయిన ఎన్నో మధుర క్షణాలను వడ్డీతో సహా కలిపి మూడు నెలల్లో 37 వేల కిలోమీటర్ల ప్రయాణంలో సంపాదించారు.

హైదరాబాద్‌కు చెందిన డా.రాజేశ్‌ కడాకియా, డా.దర్శనలు వృత్తి రీత్యా అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు.63 ఏళ్ల రాజేశ్‌ కడాకియా(ఎండీ, ఎఫ్‌ఏసీఈపీ) ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మెడిసిన్‌, జనరల్‌ సర్జన్‌లో పట్టా పొందారు.అనంతరం లండన్‌లోని రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్జన్స్‌ నుంచి ఎఫ్‌ఆర్‌సీఎస్‌-1 పూర్తి చేశారు.ఎల్‌ఆర్‌సీపీ అండ్‌ ఎమ్‌ఆర్‌సీఎస్‌లో అడిషనల్‌ డిగ్రీలు కూడా పొందారు.1987 నుంచి ఫిజీషియన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా తీరికలేనంత బిజీగా జీవితం గడిచిపోయింది.37 ఏళ్ల వైవాహిక జీవితంలో కేవలం 37 రోజులు మాత్రమే కలిసివున్నారు.డాక్టర్లుగా ప్రజలకు ఇద్దరూ ఎంత సేవ చేసినా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఏదో తెలీని వెలితివారిని వెంటాడేది.

తాము కోల్పోయిన సంతోషాలను, ఆనందాలను తిరిగి పొందేందుకు ఆరు పదుల వయసులో ఈ జంట భారీ అడ్వెంచర్‌ ట్రిప్‌కు శ్రీకారం చుట్టింది.

రాజేశ్‌ యువకుడిగా ఉన్నప్పుడే కారుల్లో తెగచక్కర్లు కొట్టేవారు.

పలు రేసుల్లోనూ పాల్గొన్నారు.అడ్వెంచర్‌ ట్రిప్పులంటే ఆయనకు మక్కువ.1981లో భారతీయ కార్లతో జరిపిన పోటీల్లో జాతీయస్థాయిలో ఆఫ్‌ రోడ్‌ చాంపియన్‌గా కూడా నిలిచి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా అవార్డును కూడా అందుకున్నారు.దర్శనకు కూడా ట్రావెలింగ్‌ అంటే పిచ్చి.

వీరిద్దరికి వివాహం జరిగిన తర్వాత రాజేశ్‌, దర్శన్‌లు డాక్టర్లుగా బిజీబిజీ జీవితంలో నిమగ్నమైపోయారు.వ్యక్తిగత జీవితాన్ని మిస్సవుతున్నామనే ఆలోచన వారిని మెదడుని తొలిచేది.

దీంతో భార్యతో కలసి అడ్వెంచర్‌ ట్రిప్‌కు వెళ్లాలని రాజేశ్‌ భారీ ప్రణాళికను రూపొందించారు.

ఏకంగా అమెరికా నుంచి భారత్‌కు రోడ్డు మార్గం ద్వారా కారులో వెళ్లాలని నిర్ణయించారు.

అయితే ఇది ఆషామాషీ వ్యవహారం కాదని వారికి తెలుసు.ఎన్నో అనుమతులు తీసుకోవాలి.

ఒక్కో దేశంలో ఒక్కో వాతావరణం ప్రయాణించాల్సి ఉంటుంది.ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొవాల్సివుంటుంది.

అయినా దేనికి వెరవకుండా ఆరు పదుల వయసులో ‘హోమ్‌ రన్‌’ పేరుతో కాలిఫోర్నియా నుంచి హైదరాబాద్‌(రాజేశ్‌ తల్లి కోకిలాబెన్‌ కడాకియా(85) సికింద్రాబాద్‌లో నివాసం ఉంటున్నారు)కు బయలుదేరారు.

ఈ ఏడాది మార్చి 28న కాలిఫోర్నియా నుంచి న్యూయార్క్‌లోని స్వామి ముక్తానంద ఆశ్రమానికి వెళ్లారు.

అక్కడి నుంచి విమానంలో కారును పారిస్‌కు పంపారు.తిరిగి ఏప్రిల్‌ 12న పారిస్‌లో కారును తీసుకుని ప్రయాణం ప్రారంభించారు.

అమెరికా, ఫ్రాన్స్‌, బెల్జియం, జర్మనీ, డెన్మార్క్‌, నెదర్లాండ్‌, స్వీడన్‌, ఫిన్‌లాండ్‌, రష్యా, కజకిస్తాన్‌, తిరిగి రష్యా, మంగోలియా, చైనా, టిబెట్‌, నేపాల్‌ల మీదుగా రోడ్డు మార్గంలో భారత్‌కు చేరుకున్నారు.ప్రస్తుతం ఇండోర్‌ నుంచి ముంబై మార్గంలో ఉన్నారు.37 వేల కిలోమీటర్లు ప్రయాణించి జూన్‌ 12న హైదరాబాద్‌ చేరుకోనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube