పెళ్లి అనేది మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైన కార్యం.అయితే పెళ్లి అయినా తర్వాత ఆ జంట పది కాలాలపాటు పచ్చగా ఉండాలని వారిని దీవిస్తూ పెళ్లి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.
కానీ కొందరు వైవాహిక జీవితం అర్థంతరంగా ముగిసిపోతుంది.మరికొందరు ఇతర కారణాల వల్ల వారి వివాహాన్ని రద్దు చేసుకుని విడాకులు తీసుకుంటున్నారు.
కానీ ఉత్తర ప్రదేశ్ లో మాత్రం పెళ్లయిన రెండు గంటలకే ఆ పెళ్లి కాస్త పెటాకులు అయింది.పోలీసులు తెలిపిన వివరాల మేరకు.
ఉత్తరప్రదేశ్ లోని పిప్రాయిచ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హెమ్చాపర్ గ్రామంలో ఒక వివాహ వేడుక జరిగింది.అయితే ఈ వివాహ వేడుకలో కొంతమేర గందరగోళం వాతావరణం ఏర్పడింది దీంతో పెళ్లైన రెండు గంటలకే ఆ పెళ్లి రద్దయింది.
ఎంతో అంగరంగ వైభవంగా ఆ పెళ్లి వేడుక జరిగి,పెళ్లి తంతు ముగిసింది.అమ్మాయిని అత్తవారింటికి పంపడానికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు.అయితే అత్తవారి ఇంటికి వెళ్లే సమయంలో వరుడు ఉన్నపళంగా స్పృహ తప్పి కిందపడిపోయాడు.దీంతో ఆ గ్రామంలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
దీంతో వధువు అతనితో పాటు అత్తారింటికి వెళ్లనని మొండిపట్టు పట్టింది.
వరుడు ఉన్నపలంగా అలా స్పృహ తప్పి పడిపోవడంతో వధువు కుటుంబంలో తీవ్ర అనుమానాలు రేకెత్తాయి.
వరుడు ఏదో దీర్ఘకాలిక జబ్బుతో బాధ పడుతున్నట్లు వధువు కుటుంబ సభ్యులు ఆరోపించారు.ఇలా ఇరు వర్గాల కుటుంబ పెద్దలు దాదాపు రెండు గంటల పాటు పంచాయతీ జరిపారు.
అయితే ఎంతసేపటికి వధువు కుటుంబ సభ్యులు రాజీ పడకపోవడంతో ఆ పెళ్ళిని ఇరు కుటుంబాల సభ్యులు క్యాన్సిల్ చేసుకొని, వరుడుకి సమర్పించిన కట్న, కానుకలను తిరిగి వధువు కుటుంబ సభ్యులు తీసుకున్నారు.ఇలా పెళ్లైన రెండు గంటలకే ఆ పెళ్లిని రద్దు చేశారు.