కెమెరాకు చిక్కిన వింత సంఘటన.! రోడ్డుపైనే మత్తుగా ఆ యువతి యువకులు.!

తెలుగు రాష్ట్రాల్లో వర్షం భీబత్సం సృష్టిస్తుంది.ఇక భాగ్యనగరంలో అయితే చెప్పనక్కర్లేదు.

 Couple Drinking Alcohol In Road Side Archives-TeluguStop.com

కొద్దిగా వర్షం పడితేనే ఒక రేంజ్ లో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.అలాంటిది వరుసగా పడుతూ ఉంటె ట్రాఫిక్ కష్టాలు అంతా ఇంతా కాదు.

ఇలాంటి వర్షంలో వేడి వేడిగా ఏదైనా తింటే వచ్చే ఆ ఫీల్ ఏ వేరు అనుకుంటారు చాలా మంది.రోడ్ సైడ్ ఉండే మిర్చి బందీలకు, మొక్క జొన్నలకు ఈ టైం లో గీరాకి పెరిగిపోతూనే ఉంటుంది.

కానీ ఓ యువతి యువకుడు మాత్రం మద్యం తాగుతూ, గంజాయి పీలుస్తు కెమెరాకు చిక్కారు.
అబిడ్స్‌ రోడ్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ టెలిఫోన్‌ ఎక్సెంజ్‌ వద్ద ఈ సన్నివేశం చోటు చేసుకుంది.

ఎవరేమనుకుంటే తమకేంటి అన్నట్టుగా వారిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ‘చుక్కే’శారు.మూసి ఉన్న దుకాణం ముందు తాపీగా కూర్చుకుని మందు మజాతో విందు చేసుకున్నారు.మత్తు సరిపోలేదో, కిక్‌ ఇంకా కావాలనుకున్నారో తెలియదు కానీ మద్యానికి గంజాయి, సిగరెట్‌ జత చేసుకున్నారు.లోకమంతా మరిచి మత్తులో మునిగి తేలారు.పబ్లిగ్గా మందేస్తున్న చుక్క, చక్కనోడిని చూసి ఆ దారిన పోయే వారంతా నోళ్లు వెళ్లబెట్టారు.ఇదేం చోద్యమంటూ గుసగుసలాడారు.

గ‘మ్మత్తు’ అంటే ఇదేనేమో!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube