రక్తం ఇచ్చి చిన్నారి ప్రాణాలను కాపాడిన వధూవరులు.. ప్రశంసిస్తున్న నెటిజన్లు..

పెళ్ళి మండపం సిద్ధంగా ఉంది.అతిథులంతా పెళ్ళికి వచ్చారు.

 Couple Donates Blood On Wedding Day, Wedding Couple Donates Blood, Up Police, Ne-TeluguStop.com

కొద్దీ సేపటిలో పెళ్లి జరగాల్సి ఉంది.కానీ అదే సమయంలో ఒక చిన్నారికి అత్యవసరంగా రక్తం అవసరమని తెలుసుకున్న ఆ నూతన వధూవరులు పెళ్లి బట్టలతోనే ఆసుపత్రికి వెళ్లి రక్తం ఇచ్చి ఆ చిన్నారి ప్రాణాలను రక్షించారు.

ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.పెళ్లి బట్టలతో వధూవరులు దిగిన ఫోటోకు లైకులు, కామెంట్స్ తో నెటిజన్స్ మోతమోగిస్తున్నారు.

అన్ని దానాల కన్నా రక్త దానం చాలా గొప్పది.ఈ విషయాన్నీ ఒక పెళ్లి జంట నిరూపించారు.రక్తం సరైన సమయానికి అందకపోతే ఆ చిన్నారి ప్రాణాలతో ఉండదు అని తెలుసుకున్న ఆ వధూవరులు సమయానికి వచ్చి రక్తం అందించి ఆ చిన్నారిని ప్రాణాలతో రక్షించారు.ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.

ఉత్తరప్రదేశ్ పోలీస్ అధికారి ఆశిష్ కుమార్ మిశ్రా ఒక ఫోటోను షేర్ చేసారు.ఇప్పుడు ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారిపోయింది.ఆ ఫోటోలో నూతన వధూవరులు ఉన్నారు.వారిలో వరుడు రక్త దానం చేస్తుండగా వధువు పక్కనే నిలబడి ఉన్న ఫోటోను షేర్ చేసారు.

ఆయన ఈ ఫోటో గురించి ట్వీట్ చేస్తూ.

నా భారత దేశం ఎంత గొప్పదో ఒక చిన్నారికి అత్యవసరంగా రక్తం కావాల్సి ఉండగా ఆ పాపకు రక్తం ఇచ్చేందుకు ఎవ్వరు ముందుకు రాలేదు.

ఎందుకంటే ఆ బిడ్డ వేరొకరి బిడ్డ కాబట్టి.కానీ ఈ జంట అలా అనుకోలేదు.రక్తదానం చేసి ఆ చిన్నారిని రక్షించారు’ అంటూ ఆయన ట్వీట్ చేసారు.ఈ ఫోటోను చుసిన నెటిజన్లు వారిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

పెళ్లి జరిగే సమయంలో కూడా పెళ్లిని వదిలేసి ఆసుపత్రికి వచ్చి రక్తం ఇచ్చి చిన్నారిని కాపాడినందుకు మీకు చేతులెత్తి నమస్కరించాలి అని చెబుతున్నారు.

https://twitter.com/IndianCopAshish/status/1363741345190268931/photo/1
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube