రెండేళ్లు డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్నారు... పెళ్లైన 12 గంటలకే ఏం జరిగిందంటే...?  

Couple Dating For 2 Years Ends \'happily Ever After\' In 12 Hours - Telugu Couple Dating For 2 Years Ends \\'happily Ever After\\' In 12 Hours, Dating, Divorce, Marriage, Police, Socil Media, Viral News

ఈ మధ్య కాలంలో యువత ఆకర్షణ, ప్రేమలకు లోనై తమ జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు.ప్రేమ, ఆకర్షణ వలన కెరీర్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ ఆ తరువాత బాధ పడుతున్నారు.

Couple Dating For 2 Years Ends \'happily Ever After\' In 12 Hours - Telugu Couple Dating For 2 Years Ends \\'happily Ever After\\' In 12 Hours, Dating, Divorce, Marriage, Police, Socil Media, Viral News-General-Telugu-Telugu Tollywood Photo Image

తాజాగా ఒక జంట రెండు సంవత్సరాలపాటు డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్నారు.పెళ్లైన 12 గంటలకే యువతి యువకుడితో కలిసి జీవించడం ఇష్టం లేదని చెప్పింది.

యువతి అలా చెప్పటంతో తొలుత షాక్ అయిన యువకుడు ఆ తరువాత నిలకడ లేని మనస్తత్వం ఉన్న అమ్మాయితో తాను కూడా కలిసి జీవించలేనని చెప్పాడు.
పూర్తి వివరాలలోకి వెళితే ఒక యువతి, యువకుడు ఒకరినొకరు రెండు సంవత్సరాల పాటు గాఢంగా ప్రేమించుకున్నారు.

ఈ విషయం యువతి ఇంట్లో తెలిసింది.యువతి తల్లిదండ్రులు యువకునిపై యువతి చేత బలవంతంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయించారు.

ఆ తరువాత పోలీసులు యువకుడిని అరెస్ట్ చేశారు.ఈ విషయం తెలిసిన యువతి తల్లిదండ్రుల బలవంతం వలన తాను ఫిర్యాదు చేశానని యువకుడిని వదిలిపెట్టాలని కోరింది.

తాను ఆ యువకుడిని రెండు సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నానని చెప్పింది.పోలీసులు యువతి యువకుడిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అబ్బాయి తల్లిదండ్రుల సమక్షంలో పెళ్లి చేశారు.పెళ్లైన 12 గంటల తరువాత యువతి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి తనకు పెళ్లి ఇష్టం లేదని తన భర్తతో విడిపోవాలని అనుకుంటున్నానని చెప్పింది.ఏం చేయాలో పాలుపోక పోలీసులు యువకుడిని పిలిచి యువతితో విడిపోవటానికి ఒప్పించారు.

తాను మనస్పూర్తిగా విడిపోవడానికి అంగీకరిస్తున్నానని నిలకడ లేని మనస్తత్వం ఉన్నవారితో కలిసి జీవించలేనని యువకుడు పోలీసులకు చెప్పాడు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది.

తాజా వార్తలు

Couple Dating For 2 Years Ends \'happily Ever After\' In 12 Hours-dating,divorce,marriage,police,socil Media,viral News Related....