హైదరాబాద్‌లో దంపతుల ఆత్మహత్య..!

జీవనోపాధి కోసం నగరానికి వలసొచ్చిన భార్యాభర్తలు విగతజీవులుగా కనిపించారు.భర్త భవంనపై నుంచి దూకేసి ఆత్మహత్య చేసుకున్నాడు.

 Couple Commits Suicide In Hyderabad-TeluguStop.com

భార్య ఇంట్లో శవమై తేలింది.ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని పంజాగుట్టలో చోటుచేసుకుంది.

పూర్తీ వివరాల్లోకి వెళ్తే.

 Couple Commits Suicide In Hyderabad-హైదరాబాద్‌లో దంపతుల ఆత్మహత్య..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాగేశ్వరరావు, రోజా భార్యాభర్తలు.

పదేళ్ల కిందట బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు.వారు పంజాగుట్ట పరిధిలో ఓ అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నారు.

ఆ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.దంపతులు ఒక్కసారిగా మృతి చెందడంతో స్థానికులు ఆందోళనకు గురైయ్యారు.

దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు సంఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలించారు.కేసు నమోదు చేసుకొని పలు కోణాలలో దర్యాప్తు చేపట్టారు.

మృతుడు నాగేశ్వరరావు తాను అద్దెకు ఉంటున్న నివాస భవనం పైనుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.మృతుడి భార్య రోజా అనుమానాస్పద స్థితిలో ఇంట్లో శవమై తేలింది.

భర్త నాగేశ్వరరావు భార్యను హత్య చేసి.తాను ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

మృతురాలు రోజా ఒంటిపై ఎలాంటి గాయాలైన ఆనవాళ్లు కనిపించకపోవడంతో ఆమె మరణం ఇప్పుడు మిస్టరీగా మారింది.

నాగేశ్వరరావు తన భార్య ముఖంపై దిండుతో గట్టిగా అదిమి హత్య చేసి ఉండొచ్చని.

లేకుంటే ఆవేశంలో ఛాతిపై బలంగా కొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయి ఉంటుందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.భార్యను హత్య చేసిన అనంతరం భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం మిస్టరీ వీడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

#Hyderabad #Police #Couple #Panjagutta #Suicide

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు