ఏపీ సచివాలయం వద్ద కలకలం.. !

వ్యవస్దలో లోపాలుంటే అవి మనుషుల జీవితాలను శాసిస్తాయని ఎన్నో సార్లు నిరూపించబడింది.ముఖ్యంగా అవినీతి అనేది కరోనా కంటే భయంకరమైన వ్యాధిలా మారుతుంది.

 Couple Commits Suicide At Ap-TeluguStop.com

లోకంలో విస్తరించే వ్యాధులకు మందులు కనుగొనవచ్చునేమో గానీ అవినీతికి మాత్రం ఏ మందు లేదు.

ఇలా అవినీతికి పాల్పడే వారి వల్ల ఎందరి జీవితాలు చీకట్లో కలిసిపోతున్నాయో తెలిసిందే.

 Couple Commits Suicide At Ap-ఏపీ సచివాలయం వద్ద కలకలం.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే ఏపీ సచివాలయం వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతుంది.నెల్లూరు జిల్లాకు చెందిన ఈ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో పాటుగా పెట్రోల్ డబ్బాతో వచ్చి ఆత్మహత్యా యత్నం చేశారు.

ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన సమాచారం తెలుసుకుంటే.

నెల్లూరు జిల్లా దుత్తలూరు ఎమ్మార్వో చంద్రశేఖర్ పొలాన్ని ఆన్‌లైన్ చేస్తానని నమ్మించి కోటి రూపాయల పైన డబ్బులు తీసుకుని మోసం చేశారని వీరు ఆరోపిస్తున్నారు.

కాగా విషయం తెలుసుకున్న పోలీసులు సచివాలయానికి వచ్చి ఆత్మహత్యకు యత్నించిన దంపతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారట.

#Couple Commit #Suicide #Secretariat

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు