సరదా పార్టీ జైలు పాలు చేసింది... అమెరికా జంటపై 30 కేసులు..!!

మన సరదాలు, సంతోషాలు ఎదుటు వారికి ఇబ్బందిగా మారకూడదు, అలాగే ప్రకృతికి విరుద్దంగా ఉండకూడదు.ఇప్పటికే మనుషుల రోజు వారి తప్పిదాల వలన, కాలుష్య కారకాల వలన బయో డైవర్సిటీ బ్యాలన్స్ తప్పుతోందంటూ నిపుణులు, పర్యావరణ వేత్తలు నోళ్ళు పడిపోయేలా ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్య పరుస్తూనే ఉన్నారు.

 Couple Charged Over Deadly California Wildfire Sparked By Gender Reveal Party-TeluguStop.com

పర్యావరం బ్యాలన్స్ గా ఉండాలంటే చెట్లు నాటడమే ఇందుకు సరైన మార్గమని సూచనలు చేస్తూనే ఉన్నారు.అయినా సరే కొందరి స్వార్ధం, అజాగ్రత్తల కారణంగా ప్రకృతి వినాశనానికి కారణం అవుతున్నారు.

తాజాగా అమెరికాలో వేల ఎకరాల అటవీ భూమి అగ్నికి ఆహుతి అవడం ప్రకృతి ప్రేమికులను కలిచివేస్తోంది.ఇందుకు కారణమైన ఓ జంటను అదుపులోకి తీసుకుని అమెరికా పోలీసులు దాదాపు 30 కేసులు వారిపై నమోదు చేశారు.

 Couple Charged Over Deadly California Wildfire Sparked By Gender Reveal Party-సరదా పార్టీ జైలు పాలు చేసింది… అమెరికా జంటపై 30 కేసులు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వివరాలలోకి వెళ్తే.

కాలిఫోర్నియా ప్రాంతానికి చెందిన మాన్యుయల్ జిమేనేజ్ ఏంజెలా రీనీ అనే భార్యా భర్తలు తమకు పుట్టబోయే బిడ్డ కోసం పార్టీ ఏర్పాటు చేశారు.

ఈ పార్టీకు సన్నిహితులు, భందువులు హాజరయ్యారు.ఈ పార్టీలో భాగంగా ఫైరో టెక్నిక్ అనే మంటలు వ్యాపించే వస్తువులను నింగిలోకి వదిలారు.ఆ సమయంలో మంటలు అదుపు తప్పి అక్కడి దగ్గరలో ఉన్న చెట్లు, పొదలపై పడ్డాయి.దాంతో వెంటనే వేగంగా మంటలు వ్యాపించి దగ్గరలోని అడవికి అంటుకున్నాయి.ఈ క్రమంలోనే

దాదాపు 23 వేల ఎకరాలు అగ్నికి దహించుకుపోయాయి.ఎలరోడా ప్రాంతంలోని అడవులలో జరిగిన ఈ సంఘటనలో 4 ఇళ్ళు అగ్నికి ఆహుతి కాగా, ఓ అగ్ని మాపక అధికారి కూడా మంటల్లో పడి మృతి చెందారు.దాంతో విచారణ చేపట్టిన అధికారులకు సదరు జంట చేసుకున్న పార్టీ కారణంగా ఇంతటి దారుణం జరిగింది తెలుసుకుని ఇరువురిపై 30కి పైగా కేసులు నమోదు చేశారు.ప్రస్తుతం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

#Gender Reveal #America #GenderReveal #Americans #Fgighter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు