వైరల్: మెట్రో రైలులో ప్రేమజంట నిర్వాకం.. నోరెళ్లబెట్టిన జనం  

Couple Caught Kissing In Delhi Metro - Telugu Couple, Delhi Metro, Kissing, Viral News, Weird News

ప్రేమలో మునిగితేలే జంటలకు ఎవ్వరేమనుకున్నా సంబంధం లేదనే చందానా వారు ప్రవర్తిస్తుంటారు.ముఖ్యంగా పార్కుల్లో, పబ్బుల్లో, సినిమా థియేటర్లలో వారు చేసే పనులు చూసి ముఖం తిప్పుకుంటారు చాలా మంది జనం.

Couple Caught Kissing In Delhi Metro

కానీ ఇక్కడ ఓ ప్రేమజంట చేసిన పని ఇప్పుడు వైరల్‌గా మారి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఇటీవల హైదరాబాద్ మెట్రో రైలు లిఫ్టులో ప్రేమజంటలు ఎలాంటి కక్కుర్తి పాల్పడ్డాయో మనం చూశాం.

అదంతా వారు లిఫ్టులో ఉన్నాం కదా ఎవరూ చూడరనుకొని రెచ్చిపోయారు.కానీ ఢిల్లీ మెట్రో రైలులో ఓ ప్రేమజంట చేసిన పనితో అక్కడున్నవారు నోరెళ్లబెట్టారు.

రైలులో ప్రయాణం చేస్తున్న ఇద్దరు ప్రేమికులు లిప్‌లాక్‌లతో రెచ్చిపాయారు.ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకుని వారు చేస్తున్న రొమాన్స్‌ను ఓ వ్యక్తి వీడియో తీశాడు.

అది కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్‌గా మారింది.

ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే విధంగా మెట్రో రైలులో ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని ఢిల్లీ మెట్రో అధికారులు హెచ్చరిస్తున్నారు.

మెట్రో రైలులో ఇలాంటి పనికి పాల్పడిన జంటను గుర్తించి తగు చర్యలు తీసుకుంటామని ఢిల్లీ మెట్రో అధికారులు వెల్లడించారు.

#Delhi Metro #Kissing #Couple

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Couple Caught Kissing In Delhi Metro Related Telugu News,Photos/Pics,Images..