మోడీ మీద గొడవపడి పెళ్ళి క్యాన్సల్ చేసుకున్న జంట

ఏ పెద్ద వ్యక్తీకి అయినా సరే, అభిమానులు ఉంటారు అలాగే వ్యతిరేకులు ఉంటారు.సపోర్ట్ చేసేవారు ఉంటారు, అసహ్యించుకునే వారు కూడా ఉంటారు.

 Couple Cancelled Marriage After A Debate On Narendra Modi-TeluguStop.com

అది ఎవరైకనా సహజమే.ప్రధానమంత్రి మోడీకి కూడా అంతే.

అసలు గుజరాత్ చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడే ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయారు.మోడీ సపోర్టర్స్ ది ఓ వర్గం, మోడీ వ్యతిరేకులది ఓ వర్గం.

ఇప్పుడైతే కండీషన్ పీక్స్ లో ఉంది.మోడీ సపోర్టర్స్ ని భక్తులు అంటున్నారు, మోడీ వ్యతిరేకుల్ని లిబరల్స్ అంటున్నారు.

సోషల్ మీడియాలో ఈ సినిమా హీరోల ఫ్యాన్స్ కంటే తక్కువగా దెబ్బలాడుకోవట్లేదు ఈ గుంపులు.అలాంటి గొడవే ఇద్దరి మధ్య జరిగింది.

విషయం ఏమిటంటే, ఆ ఇద్దరు పెళ్ళి చేసుకోబోయేవారు.

ఉత్తరప్రదేశ్ లో కొన్నిరోజుల్లో పెళ్ళి చేసుకోబోతున్న ఓ జంట తమ వివాహాన్ని క్యాన్సిల్ చేసుకున్నవారు.

కారణం నరేంద్ర మోడీ.ఆయనపై ఇద్దరికీ వేరు వేరు అభిప్రాయలు ఉండటమే.

పెళ్ళి కొడుకు ఓ బిజినెస్ మెన్, పెళ్ళి కూతురు ఒక గవర్నమెంటు ఉద్యోగిని.ఇదరికి పెళ్ళి కుదిరింది.

పెళ్ళి పనులన్నీ చక చక నడుస్తున్నాయి.ఇద్దరు కలిసి గుడికి వెళ్ళారు.

అక్కడ పూజారితో పెళ్ళి పనుల గురించి మాట్లాడటానికి.వచ్చిన పని ముగించుకున్నాక ఇద్దరు కబుర్లు పెట్టుకుంటున్నారు.

ఆ మాటల్లోనే మోడీ టాపిక్ వచ్చింది.మోడీ వలన దేశ ఆర్ధిక వ్యవస్థ ముందుకి వెళుతోందని అబ్బాయి, లేదు మోడీ వలెనే మనం వెనకబడిపోతున్నాం అని అమ్మాయి.

ఇద్దరు స్థిరపడిన వారే.ఇద్దరికీ ఆర్ధిక వ్యవస్థ మీద, ప్రభుత్వం పనితీరు మీద జ్ఞానం ఉంటుంది.

ఇంకేం … ఈ గొడవ ఇంతకు తెగదు.మోడీని సపోర్ట్ చేస్తూ అబ్బాయి, మోడీని వ్యతిరేకిస్తూ అమ్మాయి చాలాసేపు వాదించుకున్నారట.

చివరికి ఈ వాదన ఎక్కడి దాకా వెళ్ళిందంటే, ఇద్దరు తమ అభిప్రాయ తేడాల వలన పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నారు.చూసారా మోడీ ఎంత పని చేసారో.

వారి పేర్లు ఏంటి, ఉత్తర ప్రదేశ్ లోని ఏ ప్రాంతానికి చెందినవారు ? ఇలాంటి వివరాలు ఏమి తెలుపకుండా ఏ వెరైటి స్టోరిని ఓ జాతీయ దినపత్రిక రిపోర్ట్ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube