వరల్డ్ కప్ స్పెషల్ : ప్రపంచకప్ లో భారత్ కి గట్టి పోటీనిచ్చే దేశాలు ఇవే...  

Countries Which Gives Strong Competition For India In This World Cup-england,new Zealand,pakistan,south Africa,ప్రపంచకప్

మరి కొన్ని రోజుల్లో క్రికెట్ ప్రపంచ కప్ ఆరంభం కానుంది , ఇంగ్లాండ్ లో జరిగే ఈ ప్రపంచ కప్ ఫెవరేట్ జట్లలో భారత జట్టు కూడా ఒకటి . అయితే ఇటీవల భారత్ తన సొంత గడ్డ పైన ఆస్ట్రేలియా పైన ఆడిన వన్డే సిరీస్ లో ఓటమి పాలవడం జట్టు పైన అనుమానాలు వస్తున్నాయి . ఇప్పటికి భారత జట్టు మిడిల్ ఆర్డర్ స్థిరంగా లేకపోవడం దానికి తోడు గత కొన్ని సంవత్సరాల నుండి నెంబర్ 4 స్థానం లో స్థిరంగా ఆడే బ్యాట్స్ మెన్ పైన సందిగ్దత ఉండడం భారత అభిమానులను తీవ్ర నిరాశ కి గురి చేస్తుంది . 2019 ప్రపంచ కప్ కి ఆడే ప్రాబబుల్ జట్టు లో విజయ్ శంకర్ ని నెంబర్ 4 స్థానం లో బ్యాటింగ్ చేసే ఆటగాడిగా ప్రకటించారు ఇక ఈ సారి భారత జట్టుకి వరల్డ్ కప్ లో గట్టి పోటీనిచ్చే జట్లు ఇవే.

వరల్డ్ కప్ స్పెషల్ : ప్రపంచకప్ లో భారత్ కి గట్టి పోటీనిచ్చే దేశాలు ఇవే...-Countries Which Gives Strong Competition For India In This World Cup

ఆస్ట్రేలియా

2015 లో సొంత గడ్డ పైన ప్రపంచ కప్ గెలిచినా తరువాత ఆ జట్టు సీనియర్ ఆటగాళ్లు క్రికెట్ కి వీడ్కోలు చెప్పారు . తరువాత వార్నర్ , స్మిత్ , స్టార్క్ లాంటి స్టార్ ఆటగాళ్లు జట్టు నడిపించిన సౌత్ ఆఫ్రికా లో బాల్ టాంపరింగ్ వివాదం లో చిక్కుకొని స్మిత్ , వార్నర్ లు నిషేధానికి గురయ్యారు .

దానితో క్రికెట్ ఆస్ట్రేలియా ఒక్కసారిగా పతనం అయింది . వరుసగా పాకిస్తాన్ , సౌత్ ఆఫ్రికా , భారత్ లతో సిరీస్ లు కోల్పోయి బలహీనంగా మారింది కంగారు జట్టు . అయితే ఇటీవల ఉప ఖండం లో జరిగిన వన్డే సిరీస్ లలో భారత్ పైన 3-2 తో పాకిస్తాన్ పైన 5-0 గెలిచి ప్రపంచ కప్ ముందు బలమైన జట్టుగా మారింది . పైగా బాల్ టాంపరింగ్ బ్యాన్ ముగిసిన స్మిత్ , వార్నర్ లు జట్టు లో కి రావడం తో పాటు ఇంగ్లాండ్ పిచ్ ల పైన ఆడిన అనుభవం ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఎక్కువగా ఉండడం ఆ జట్టు ని ప్రపంచ కప్ ఫెవరేట్లలో ఒకటిగా చెబుతున్నారు విశ్లేషకులు .

ఇక నాకౌట్ స్టేజి లో ఆస్ట్రేలియా తో మ్యాచ్ జరిగితే భారత జట్టు విజయం కోసం గట్టిగా పోరాడాల్సిందే.

న్యూజిలాండ్

గత ప్రపంచ కప్ లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఫైనల్ వరకు చేరిన కివీస్ జట్టు ప్రపంచ క్రికెట్ లోనే బలమైన జట్లలో ఒకటి . మార్టిన్ గుప్తిల్ , కేన్ విలియమ్సన్ , రాస్ టేలర్ లాంటి ఆటగాళ్లతో బలమైన బ్యాటింగ్ లైన్ అప్ ఉన్న న్యూజిలాండ్ టీం ఇండియా తో ఆడాల్సి వస్తే పోరు హోరాహోరీగా ఉంటుందనడం లో ఎటువంటి సందేహాలు లేవు.

దక్షిణాఫ్రికా

ప్రపంచ కప్ లో ఎంత బలమైన జట్టు తో బరిలోకి దిగిన అదృష్టం లేక ఏదో ఒక రూపం లో కప్ కి దూరం అవుతుంది . 2015 వరల్డ్ కప్ లో సెమీస్ వరకు వచ్చిన సౌత్ ఆఫ్రికా జట్టు ఈ సారి ఇంగ్లాండ్ పిచ్ ల పైన తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. హషిమ్ ఆమ్లా , డుప్లెసిస్ , డికాక్ , డుమినీ లాంటి బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ప్రోటీయస్ సొంతం . ఈ సారి భారత జట్టు కి గట్టి పోటీ ఇచ్చే జట్లలో సౌత్ ఆఫ్రికా జట్టు కూడా ఒకటి.

పాకిస్తాన్

భారత జట్టు తో పోల్చుకుంటే బలహీనంగానే ఉండే పాకిస్తాన్ జట్టు, ఎప్పుడు ఏవిధంగా ఆడుతుందో తెలియదు. 2017 ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ ఓటమి భారత అభిమానులు ఇప్పటికి మర్చిపోరు . ఇప్పటి వరకు ఆడిన ప్రపంచ కప్ మ్యాచ్ లలో పాకిస్తాన్ జట్టు ఒక్కసారి కూడా విజయం సాధించలేదు .

ఈ సారి పాకిస్తాన్ తో గ్రూప్ స్టేజి లోనే మ్యాచ్ ఉండడం తో ఇరు దేశాల అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు . తనదైన రోజున పాకిస్తాన్ ఎటువంటి జట్టుని అయినా ఓడించగలదు.

ఇంగ్లాండ్

2019 ప్రపంచ కప్ లో హాట్ ఫెవరేట్ గా బరిలోకి దిగనుంది ఇంగ్లాండ్ జట్టు . ఇటీవల జరిగిన దాదాపు అన్ని వన్ డే సిరీస్ లలో ఆ జట్టే విజయం సాధించింది. రూట్ , మోర్గాన్ , బైర్ స్టో , బట్లర్ లాంటి అత్యుత్తమ బ్యాట్స్ మెన్ లతో కూడిన ఇంగ్లాండ్ జట్టు తో భారత్ ఎలా ఆడుతుందో వేచి చూడాలి. గతేడాది ఇంగ్లాండ్ తో ఆడిన సిరీస్ లో భారత జట్టు ఓటమి పాలయింది.

ఈ సారి జరగబోయే ప్రపంచ కప్ లో టీం ఇండియా ఇంగ్లాండ్ ని ఓడించగలిగితే 3 వ సారి భారత జట్టు ప్రపంచ కప్ ని ముద్దాడుతుంది అనడం లో ఎటువంటి సందేహం లేదు..