రేపు ఎన్నికల కౌంటింగ్ ఇలా స్టార్ట్ అవుతుంది !

తెలంగాణాలో ఎన్నికల కౌంటింగ్ పై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.రేపటితో ఏ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనే విషయం తేలిపోనుంది.

 Counting Of Votes In Telangana Tomorrow Begins-TeluguStop.com

రేపు ( మంగళవారం) ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుందని సీఈఓ రజత్ కుమార్ వెల్లడించారు.సెక్రటేరియట్ మీడియాతో మాట్లాడిన ఆయన…రాష్ట్రంలో 43 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.

ఒక్కో నియోజకవర్గంలో 14 టేబుల్స్ ఉంటాయని తెలిపారు.మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారని పేర్కొన్నారు.మొత్తం 2,379 రౌండ్స్ ఉంటాయని తెలిపారు.12 గంటల వరకు ట్రెండ్స్ వస్తాయని స్పష్టం చేశారు.

కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్ లు తీసుకుని వెళ్లకూడదని తెలిపారు.పెన్ను, పేపర్ తీసుకెళ్లవచ్చు అని సూచించారు.కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఏజెంట్లు బయటకు వెళ్లొద్దని చెప్పారు.అత్యధికంగా 42 రౌండ్లు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నాయని తెలిపారు.తక్కువ రౌండ్లు భద్రాచలం, అశ్వారావుపేట 13, బెల్లంపల్లిలో 15 నియోజకవర్గాల్లో ఉన్నాయని తెలిపారు.పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మ్యాన్ వెల్ జరుగుతుందని పేర్కొన్నారు.

ఈవీఎంల లెక్కింపు సమయంలో ఆర్వో దగ్గరకు వెళ్లేందుకు అభ్యర్థికి తప్ప ఇతరులకు, ఏజెంట్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు.కౌంటింగ్ కేంద్రాల్లో 20 వేల మంది పోలీసులు శాంతిభద్రతల పర్యవేక్షణలో ఉంటారని వెల్లడించారు.

మొత్తం 40 వేల మంది సిబ్బంది కౌంటింగ్ విధుల్లో ఉంటారని తెలిపారు.మొత్తం 44,258 పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చామని రజత్ కుమార్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube