"జగన్"కు చిలక జోస్య కేంద్రం!!!

ఒక పక్క రాష్టం విడిపోయి నానా ఇబ్బందులు పడుతున్న సంగతి అందరికి తెలిసిన విషయమే.ఇక ప్రభుత్వం సైతం వీలైనంత వరకు పరిస్థితులను చక్క దిద్దడానికీ తన వంతు ప్రయత్నం తాను చేస్తూనే ఉంది.

 Counter To Jagan Comments On Chandrababu-TeluguStop.com

ఇక రాజకీయ అపర చాణఖ్యుడు చంద్రబాబు నాయుడు దేశవిదేశాలు తిరిగి సింగపూర్ దేశానికి పోటీగా రాష్ట్రాన్ని తీర్చి దిద్దాలని, ఇక రాజధానిని సైతం సింగపూర్ ను తలదన్నేలా నిర్మించాలని ఆలోచనలు చేస్తున్నారు.ఇక రాజధాని ప్రాంతంలో పరిపాలన భవనాలు, వినోద కేంద్రాలు, ఉద్యానవనాలు.

ఇలాంటివెన్నో నిర్మిస్తామని చెబుతున్నారు.ఇంతవరకు ఎలా ఉన్నా ఇప్పుడు ఆ లిస్ట్ లోకి ఓ చిలక జోస్యం, ఒక ఫిల్మ్ ఇనిస్ట్టిట్యూట్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది.

అయితే ఇదేదో నిజం అనుకుంటే మనం పొరబడినట్లే ఇదంతా తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్ పై విసురుతున్న వ్యంగాస్త్రాలు.చంద్రబాబు మరో రెండేళ్లు మాత్రమే అధికారంలో ఉంటారని జగన్ చెప్పిన జోస్యంతో టీడీపీ వారు జగన్ కు రాజధాని ప్రాంతంలో భూమి ఇప్పిస్తే జోశ్యం చెప్పుకుని బ్రతికేస్తాడని, అంతేకాకుండా జగన్ అద్భుతమైన మెలో డ్రామా పండించగలిగే వాడు కనుక ఓ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కూడా పెటిస్తే జగన్ ఇక రాజకీయాలు మానేసి.

ఆ రెండు సంస్థలు నడుపుకోవచ్చని ఉచిత సలహా ఇస్తున్నారు తెలుగుదేశం నాయకులు.విమర్శ ప్రతివిమర్శలు ఎలా ఉన్నా ఇప్పడున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రిపై ప్రతిపక్షనేత ఇలా కామెంట్స్ చెయ్యడం ఆయన స్థాయిని ఆయనే దిగజార్చుకుంటున్నట్లు ఉంది అనేది రాజకీయ విశ్లేషకుల భావన.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube