ఆ ప్రాంతంలో కౌన్సిల‌ర్ల తిరుగుబాటు..చంద్ర‌బాబు స్పెష‌ల్ ఫోక‌స్‌..

టీడీపీకి రోజ‌రోజుకూ స‌వాళ్లు పెరిగిపోతున్నాయి.ఓవైపు మొన్న వ‌చ్చిన ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో దారుణంగా ఓడిపోవ‌డం ఒక ఎత్తు అయితే ఇప్పుడు రెబ‌ల్స్ పెరిగిపోతున్నారు.

 Councilors Revolt In The Area Chandrababu Special Focus , Chandrababu, Tdp-TeluguStop.com

ఎప్పుడు ఎవ‌రు పార్టీని వీడుతారో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది.దీంతో చంద్ర‌బాబుకు కొత్త చిక్కులు వ‌చ్చిప‌డుతున్నాయి.

ఓవైపు వైసీపీని ఎదుర్కోవ‌డంతో పాటు ఇంకోవైపు సొంత పార్టీ నేత‌ల నుంచి వ‌స్తున్న తిరుగుబాటును ఒకే స‌మ‌యంలో ఎదుర్కోవ‌డం అంటే పెద్ద స‌వాలు అనే చెప్పాలి.ఇక ఇప్పుడు కాకినాడ మున్సిపాలిటీ ప‌రిధిలో తిరుగుబాటు మొద‌లైంది.

టీడీపీ చేతిలో ఉన్న అతి త్కువ మున్సిపాలిటీల్లో కాకినాడ కూడా ఒక‌టి.అయితే ఈ మున్సిపాలిటీ టీడీపీ చేతిలో ఉండ‌గా ఇందులోని కొంద‌రు టీడీపీ కౌన్సిల‌ర్ల మ‌ధ్య విబేధాలు తలెత్తాయి.

మున్సిపల్ చైర్మన్ గా ఉన్న‌టువంటి సుంకర పావనిపై తీవ్ర‌వ వ్య‌తిరేక‌త మొద‌లైంది.టీడీపీ కౌన్సిలర్లు అంద‌రూ ఆమెపై తిరుగుబాటు చేయ‌డం పెను సంచ‌ల‌నం రేపుతోంది.ఇక దొరికిందే అవకాశం అన్న‌ట్టు దీన్ని వైసీపీ ఉపయోగించుకున్నట్టుగా తెలుస్తోంది.ఇక టీడీపీలో తిరుగుబాటుదారులుగా ఉన్న కౌన్సిల‌ర్లు కొంద‌రు వైసీసీకి చెందిన కాకినాడ సిటీ ఎమ్మెల్యేతో ల‌చ్‌లో ఉన్నార‌నే వార్త‌లు గుప్పుమంటున్నాయి.

Telugu Chandrababu-Telugu Political News

ఇలాంటి త‌రుణంలో చంద్ర‌బాబు రంగంలోకి దిగిన‌ట్టు తెలుస్తోంది.ఇక సుంకర పావని రీసెంట్ గానే చంద్రబాబును కలిసి విష‌యం చెప్ప‌డంతో ఇది పెద్ద‌ద‌యిపోయింది.ఇక తిరుగుబాటు కౌన్సిల‌ర్ల విష‌యంలో చంద్ర‌బాబు విప్ ను జారీ చేయనున్నట్టు తెలుస్తోంది.ఒక‌వేళ మ‌ళ్లీ చైర్మన్ ఎన్నిక జరిగితే టీడీపీ నుంచి గెలిచిన వారెవ్వ‌రైనా విప్ ను ధిక్కరిస్తే వారిపై పార్టీ నుంచి బ‌హ‌ష్క‌ర‌ణ వేటు ఉంటుంద‌ని హెచ్చ‌రించారంట చంద్రబాబు.

మ‌రి చంద్ర‌బాబు చేస్తున్న హెచ్చ‌రిక‌ల‌ను తిరుగుబాటు దారు కౌన్సిల‌ర్లు ఖాతరు చేస్తారా లేదంటే వైసీపీకి జై కొడుతారా అన్న‌ది తెలియాలంటే వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube