పెళ్ళికి భారిగా ఖర్చు పెడుతున్న భజ్జీ

భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ పెళ్లి భోజనం పెట్టనున్నాడు.తన ప్రియురాలు, గీత బస్రాని ఈ నెల 29న పెద్దలు,బంధువులు,స్నేహితుల సమక్షంలో అత్యంత వైభవంగా మనువాడనున్నాడు.

 Costly Arrangements For Harbhajan’s Marriage-TeluguStop.com

తన రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తన సొంత ఊరు జలంధర్ లో ఈ వివాహం జరగనున్నది.

దీనికోసం తాజ్ పాలెస్ అనే పెద్ద హోటల్లో వివాహ వేదికతో పాటు వివాహానికి వచ్చే బంధువులు,స్నేహితుల కోసం ఏకంగా 200 రూములు బుక్ చేసాడు.ప్రఖ్యాత సిని గాయకుడు మికా సింగ్ ఈ వివాహ వేడుకలో పాటలు పాడి అలరించనున్నాడు.

దీనికోసం తనకి భారి మొత్తం ఆఫర్ చేసాడట భజ్జీ.వధువు గీత కోసం అర్చన కొచ్చార్, హర్భజన్ కోసం రాఘవేంద్ర రాథోర్ ప్రత్యెక దుస్తులు డిజైన్ చేస్తున్నారు.

కేవలం బట్టలకే కోట్లల్లో ఖర్చు వస్తోందట.

భారత క్రికెట్ జట్టుకి, క్రికేట్ దిగ్గజాలకు, తన సమాకాలీన అంతర్జాతీయ క్రికెటర్స్ తో పాటు, బాలివుడ్ ప్రముఖులకి ఇప్పటికే వివాహ పత్రికలు అందాయి.

అక్టోబర్ 29 రావడమే ఆలస్యం, క్రికెట్, సినిమా జగత్తు అంతా జలంధర్ లో వాలిపోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube