'ఆర్‌ఆర్‌ఆర్‌' హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ ఖరీదు ఎంతో తెలుసా.. ఇది జక్కన్న సినిమా బాబు!!

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ మల్టీస్టారర్‌ మూవీకి సంబంధించిన అన్ని విషయాలను తాజా ప్రెస్‌మీట్‌లో రివీల్‌ చేసిన విషయం తెల్సిందే.కథ మరియు హీరోల పాత్రల విషయంలో పూర్తి క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి.

 Cost Of Rrr Hindi Dubbing Rights-TeluguStop.com

అల్లూరి సీతారామరాజు మరియు కొమురం భీంలను కలిపి రాజమౌళి తీస్తున్న ఈ సినిమా మరో సంచలనానికి తెర తీయడం ఖాయంగా సినీ వర్గాల వారు అంటున్నారు.కేవలం తెలుగు ప్రేక్షకుల వరకే కాకుండా ఈ చిత్రం ఆల్‌ ఓవర్‌ ఇండియా మొత్తం కూడా ఈ చిత్రం దుమ్ము రేపడం ఖాయంగా కనిపిస్తుంది.

రాజమౌళి గత చిత్రం ‘బాహుబలి’ హిందీలో భారీగా వసూళ్లను సాధించిన విషయం తెల్సిందే.రికార్డు స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లను రాబట్టింది.బాలీవుడ్‌ టాప్‌ చిత్రాల జాబితాలో జాయిన్‌ అయ్యింది.రెండు వేల కోట్ల వసూళ్లను సాధించి బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు కూడా సాధ్యం కాని రికార్డులను నమోదు చేసింది.

అంతటి గొప్ప సినిమాను తీసిన దర్శకుడు రాజమౌళి తర్వాత సినిమా అంటే ఖచ్చితంగా బాలీవుడ్‌ వర్గాల్లో మరియు హిందీ ప్రేక్షకుల్లో అంచనాలు పీక్స్‌లో ఉంటాయి.అందుకే ఆర్‌ఆర్‌ఆర్‌ మల్టీస్టారర్‌ హిందీ డబ్బింగ్‌ రైట్స్‌కు అమాంతం రెక్కలు వచ్చాయి.

ఆర్‌ఆర్‌ఆర్‌ మల్టీస్టారర్‌ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ సంస్థలు కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నాయి.100 నుండి 150 కోట్ల వరకు ఈ చిత్రంకు పెట్టేందుకు బాలీవుడ్‌ మేకర్స్‌ సిద్దంగా ఉన్నారు.ఇలాంటి సమయంలో దానయ్య భారీగా లాభాలను ఘడించడం ఖాయం అంటూ ట్రేడ్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.భారీ అంచనాలున్న ఈ చిత్రం బాలీవుడ్‌లో రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అని, అందుకే మరింత ఎక్కువ మొత్తం పెట్టేందుకు అయినా సిద్ద పడుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇదే కనుక నిజం అయితే దానయ్య పంట పండినట్లే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube