సౌందర్య ఆ తప్పు చేయకుండా ఉంటే ప్రాణాలతో ఉండేదట

సినిమా ఇండస్ట్రీలో రానించాలంటే గ్లామర్ ఉంటే చాలని చాలా మంది అపోహ పడుతుంటారు.ముఖ్యంగా హీరోయిన్ ల విషయంలో ఇలా ప్రచారంలో ఉంది.

 Cosmetics Would Have Survived If That Had Not Been Done-TeluguStop.com

కాని గ్లామర్ ఆధారంగా సినీ రంగంలో ఎక్కువ కాలం రానించాలనుకుంటే చాలా కష్టం.ఎందుకంటే సినిమా పరిశ్రమలో చాలా కాలం రానించాలంటే గ్లామర్ తో పాటు, నటనా సామర్థ్యం ఉండాలి.

లేకపోతే నటిగా ప్రేక్షకుల అభిమానాన్ని పొందలేరు.తద్వారా ప్రేక్షకుల అభిమానం లేకపోతే అవకాశాలు రాక ఎక్కువ కాలం చాలా నిలబడలేరు.

 Cosmetics Would Have Survived If That Had Not Been Done-సౌందర్య ఆ తప్పు చేయకుండా ఉంటే ప్రాణాలతో ఉండేదట-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని అందంతో పాటు, నటిగా ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న వాళ్ళు ఉన్నారు.అందులో మొదటి స్థానంలో ఉండే వ్యక్తి సహజ నటి సౌందర్య.

సౌందర్య హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.సౌందర్య ప్రమాదానికి సంబంధించి సీనియర్ దర్శకుడు చిట్టిబాబు విస్తుపోయే నిజాలను వెల్లడించారు.బీజేపీ తరపున ప్రచారానికి వెళ్ళమని నేనే సూచించానని,ఆమె ప్రచారానికి వెళ్ళడానికి జెట్ ఎయిర్ వేస్ సౌకర్యాన్ని కల్పించానని, నాకు సౌందర్య సోదరుడు అమర్ నాథ్ తన స్నేహితుడికి హెలికాఫ్టర్ ఉందని ప్రచారానికి అందులో బయలుదేరారు.కాని రెండు సీట్ల కేపాసిటీ మాత్రమే కలిగిన ఈ హెలికాఫ్టర్ లో బరువు ఎక్కువ అవడం వలన హెలికాఫ్టర్ క్రాష్ అయిపోయి మృతి చెందిన విషయం తెలిసిందే.

అయితే అప్పుడు నా మాట విని ఉంటే ఇప్పుడు సౌందర్య మన మధ్య ఉండేదని సీనియర్ దర్శకుడు చిట్టిబాబు తెలిపారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు