ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి జలగలు.. జీతాలు సరిపోవడం లేదా సార్లు.. ??

ఒక వైపు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేయడం అనే మాటను పక్కన పెట్టి నిలువునా దోపిడి చేస్తుంటే.మరో వైపు ప్రభుత్వ అధికారులు అడుగడుగునా లంచాలకు మరిగారు.

 Corruption In Government Offices In Rangareddy For Land Layout, Rangareddy, Mahe-TeluguStop.com

ఇలాంటి వారితో బాధించబడుతున్న బాధితుల మనసుల్లో ఠాగూర్ సినిమాలో చిరంజీవి పాత్ర లాంటి మనిషి ప్రస్తుత కాలంలో ఉంటే బాగుండు అనే ఆలోచన మెదులుతుందట.

కాలు కదిపితే చాలు అడుగడుగున లంచావతారులు కనిపిస్తారు.

ఇలాంటి సొమ్ముతో డబ్బులు సంపాధించిన వారికి, లంచం ఇచ్చిన వారి ఉసురు తప్పక ఏదో ఒకరోజు తగలక మానదు.ఇకపోతే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో, లే అవుట్ అనుమతి కోసం ఏడున్నర లక్షలు డిమాండ్ చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఏసీబీకి పట్టుబడిన ఘటన చోటుచేసుకుంది.

Telugu Corrupt, Officials, Layout, Maheshwaram, Ranga, Sarpanch, Lakhs-Latest Ne

ఐదున్నర ఎకరాల భూమి కోసం ఎంపీవో రెండు లక్షలు, పంచాయతీ సెక్రెటరీ, సర్పంచ్ భర్త, ఉప సర్పంచ్‌లు కలసి ఐదున్నర లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.దీంతో విసిగిపోయిన లే అవుట్ యాజమాని ముత్యం రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, అక్రమార్కులను పట్టుకోవడానికి వలపన్నారట.

ఈ క్రమంలో పంచాయతీ అధికారి సీహెచ్‌.శ్రీనివాస్‌, పంచాయతీ సెక్రటరీ గీత, సర్పంచ్‌ భర్త రమేష్‌, ఉపసర్పంచ్ మొదలగు వీరు లంచం డబ్బులు తీసుకుంటు ఉండగా రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్నారట.

కాగా విచారణ పూర్యయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు వెల్లడించారు.పాపం తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న జీతాలు సరిపోక ఇలా చేస్తున్నారు కావచ్చూ అవినీతి దరిద్రులు అని అనుకుంటు ఉన్నారట వీరి గురించి విన్నవారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube