అమ్మ బాబోయ్ : ఓటు వేస్తే బంగారు ముక్కు పుడకలు ఇస్తామంటూ....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే మున్సిపల్ ఎన్నికలకు నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు.

 Corporator Of Nose Rings To The Women Voters In Kadapa-TeluguStop.com

దీంతో కొందరు ఓట్లను పొందేందుకు గాను డబ్బు, మద్యం, వంటివాటితో ఓటర్లను మభ్య పెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు.

దీంతో తాజాగా స్థానిక రాష్ట్రంలోని కడప జిల్లా పరిసర ప్రాంతంలో ఓ పార్టీ అభ్యర్థి ఏకంగా తనకి మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేస్తే బంగారం ముక్కు పుడకలు ఇస్తానంటూ ప్రచారాలు చేయడం మొదలు పెట్టాడు.

 Corporator Of Nose Rings To The Women Voters In Kadapa-అమ్మ బాబోయ్ : ఓటు వేస్తే బంగారు ముక్కు పుడకలు ఇస్తామంటూ….-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో అనుకున్నదే తడవుగా బంగారం ముక్కు పుడుకులను ఆర్డర్ చేసి తెప్పిస్తుండగా అనుకోకుండా పోలీసులకు చిక్కాడు.దీంతో పోలీసులు బయటకి  తెలిపకుండా రహస్యంగా విచారణ చేపట్టారు.దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది.అంతేకాక కొందరు నెటిజన్లలో ఈ విషయంపై స్పందిస్తూ 100 నోట్లకి, చీర జాకెట్లకి, ద్యం బాటిళ్ళకి లొంగిపోయి ఓట్లు వేయడం వల్ల భావితరాల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని కాబట్టి తమకు మరియు దేశానికి మంచి చేసే రాజకీయ నాయకులను ఎన్నుకోవాలని సూచిస్తున్నారు.

మరికొందరైతే ఏకంగా  10 గ్రాముల బంగారం దాదాపుగా 50 వేల రూపాయలు ఉన్న సమయంలో కూడా ఓట్ల కోసం బంగారం ముక్కు పుడకలు పంపిణీ చేస్తున్నాడంటే సాహసమనే చెప్పాలని కొందరు మీమ్ క్రియేటర్స్ ట్రోల్స్  చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా తాజాగా ఇటీవలే ఓ ప్రముఖ సంస్థ జరిపిన సర్వేలో మున్సిపల్ ఎన్నికలలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైకాపా పార్టీ ఎక్కువ స్థానాలను గెలుస్తుందని తేలిందట.

ఇక రెండో స్థానంలో తెలుగు దేశం పార్టీ మరియు మూడో స్థానంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నిలుస్తాయని అంచనా…

#Kadapa #Andhra Pradesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు